సైకో రెడ్డి పెంపుడు కుక్కలకు భయపడం.. రా చూసుకుందాం!
Publish Date:Oct 20, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని విమర్శించారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రత్యక్షంగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ సవాల్ విసిరారు. ఏపీ డీజీపీ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుందని చెప్పినా పట్టించుకోలేదన్నారు. పోలీసులే స్వయంగా వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చారని లోకేశ్ ఆరోపించారు. డీజీపీ కనుసన్నల్లోనే దాడులు జరిగాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా అందరి కథ తేలుస్తామన్నారు నారా లోకేష్. జగన్ రెడ్డి దేశంలో ఎక్కడ దాకున్నా లాక్కొస్తామన్నారు.
ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నకు దమ్ముంటే సమాధానం చెప్పాలి.లేనిపక్షంలో ఇంటికే పరిమితం కావాలన్నారు.దాడులు చేసినంత మాత్రానా తాము భయపడేది లేదని అన్నారు నారా లోకేష్. ప్రభుత్వం చేసే తప్పులపై పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిపోయిందన్నారు లోకేశ్. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా ఏపీ మూలాలు భయటపడుతున్నాయని చెప్పారు. ఏపీ నుంచి గంజాయి ఎక్కువగా వస్తుందని హైదరాబాద్ సీపీ తెలిపారన్నారు. రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ది లేదన్న నారా లోకేష్.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/nara-lokesh-fire-on-cm-jagan-over-tdp-office-attacs-25-124888.html





