ఐదు బిల్లులకు మండలి ఏకగ్రీవ ఆమోదం.!

Publish Date:Aug 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి  ఐదు ప్రముఖ్యమైన బిల్లులకు   ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ ఐదు కీలక బిల్లులనూ కూడా మంత్రి నారా లోకేష మండలిలో ప్రదేశపెట్టారు.  రాష్ట్రంలో విద్య, గ్రంథాలయాలు,  స్కిల్ డెవలప్‌మెంట్ రంగాలలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లులపై మండలిలో  చర్చించిన అనంతరం సభ్యులు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే  ఏపీ ఉన్నత విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే..  విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది.  విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ నియామకాలు, కేడర్ రిజర్వేషన్ల ప్రక్రియను క్రమబద్ధీకరించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాసంస్థల సవరణ బిల్లుకూ  సభ ఆమోదం తెలిపింది.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు   ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలు కల్పించే ఏపీ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన,  క్రమబద్ధీకరణ బిల్లుకూ మండలి ఆమోదముద్ర వేసింది. ఈ ఐదు బిల్లులూ చట్ట రూపం దాలిస్తే.. రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, లైబ్రరీ వ్యవస్థల ఆధునీకరణ ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన జ్ఞాన వనరులు అందుబాటులోకి రానున్నాయి.

మరోవైపు నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు వల్ల రాష్ట్రంలోని యువతకు గ్లోబల్ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ లభిస్తుంది.  ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలకు తగ్గ పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయి.  మండలిలో ఏకగ్రీవం పొందిన ఈ ఐదు బిల్లులూ.. గవర్నర్ ఆమోద ముద్రతో చట్టంగా మారి  అమలులోకి వస్తాయి.  

Nara Lokesh, AP Legislative Council, AP Education Bills 2026, AP Private Skill University Bill, TeluguOne

By
en-us Political News

  
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ గాజా క్యాపిటల్ ఐపీఓ చివరి రోజు నాటికి 2.52 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జీఎమ్‌పి, లిస్టింగ్ గెయిన్స్, లాట్ సైజు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో దేశం శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కేజీకి పైగా బంగారం, స్థలాలు, భవనాలు మరియు బార్‌లో పెట్టుబడులకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఈ కథనంలో చదవండి.
భారతదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తామని ఎలన్ మస్క్ హామీ ఇచ్చారు. 11 వేలకు పైగా గ్రామాల్లో 4G నెట్‌వర్క్ లేని పరిస్థితుల్లో, స్పేస్‌ఎక్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మరియు భారతీయ నిబంధనల సవాళ్లపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 కిలోమీటర్లకు 2 గంటల సమయం పడుతోందని, ఉద్యోగుల ప్రయాణ నరకంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.