హౌసింగ్ డాక్యుమెంటేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మంగళ ప్రజల హృదయాలలో లోకేష్ స్థానం సుస్థిరం.!
Publish Date:Sep 28, 2026
Advertisement
2024 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత చారిత్రక తీర్పును వెలువరించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్ ఇక్కడి నుంచి 92 వేలకు పైగా భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా టీడీపీకి అందని ద్రాక్షలా ఉన్న ఈ స్థానంలో, లోకేష్ అఘండ మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు అంటే 2019 ఎన్నికలలో లోకేష్ ఇదే స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. అయితే ఓటమి తరువాత.. నియోజకవర్గ సమస్యలపై ప్రజల తరఫున నిరంతరం గళం విప్పుతూ ప్రజాభిమానాన్ని చూరగొని ఎక్కడైతో పరాజయాన్ని ఎదుర్కొన్నారో అక్కడే తిరుగులేని విజయం సాధించి సత్తా చాటారు. గెలిచిన క్షణం నుంచీ లోకేష్ మంగళగిరి ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు. మంగళగిరిలో హౌసింగ్ డాక్యుమెంటేషన్ సమస్య నిన్న మొన్నటిది కాదు. దశాబ్దాలుగా తిష్ఠ వేసుకుని కూర్చున్న సమస్య. అటువంటి సమస్య పరిష్కారానికి నారా లోకేష్ నడుంబిగించి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ లోకేష్ గురించి చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది. సురక్షితం కాదని తెలిసినా మంగళగిరి నుంచే 2019 ఎన్నికల మంగళగిరి బరిలో నిలిచారు. ఆ పరాజయం తరువాత కూడా వెన్ను చూపని లోకేష్ 2024 ఎన్నికలలోనూ మంగళగిరినే ఎంచుకుని పోటీ చేశారు. ఆ సందర్భంలోనే మంగళగిరిలో అపరిష్కృతంగా ఉన్న హౌస్ డాక్యుమెంటేషన్ సమస్య పరిష్కరించాలన్న విజ్ణప్తి స్థానిక ప్రజల నుంచి బలంగా వినిపించింది. అయితే.. లోకేష్ ఈ విషయంలో అప్పుడు ప్రజలకు హామీ ఇవ్వలేదు. ఈ అంశంపై తనకు పూర్తి అవగాహన లేదని నిజాయితీగా ఒప్పుకుని, హామీ ఇవ్వలేనని విస్పష్టంగా చెప్పారు. 2024 ఎన్నికలలో విజయం తరువాత.. ఈ సమస్యకు సంబంధించిన పూర్తి అవగాహనకు వచ్చారు. అప్పుడు ఆయన విస్పష్ట హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ నిర్మాణ పత్రాలు అందిస్తామని విస్పష్ట హామీ ఇచ్చారు. ఇప్పుు ఆ హామీని అంతే నిజాయితీగా పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ హౌసింగ్ డాక్యుమెంటేషన్ సమస్యను పరిష్కరించి మాట నిలబెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. మంగళగిరిలో హౌసింగ్ డాక్యుమెంటేషన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. తద్వారా లోకేష్ మంగళగిరి ప్రజలకు మరింత చేరువ అవ్వడమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగేలా బలమైన పునాది వేసుకన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రజా సమస్యను పరిష్కరించడంలో చొరవ తీసుకున్న లోకేష్ మంగళగిరి ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.
[Nara Lokesh, Mangalagiri housing Documentation, Promise, Mana Illu Mana Lokesh, AP Government Land Pattas, Permanent Title Deeds, Telugu One]
http://www.teluguone.com/news/content/nara-lokesh-39-232753.html




