బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై ఏమన్నారంటే?

Publish Date:Dec 16, 2025

Advertisement

 

ఇటీవల బిజినెస్ టుడే అవార్డునందుకుని వార్తల్లో నిలిచిన నారా బ్రాహ్మణికి సంబంధించి కొత్త అప్ డేట్ డెలివరీ అయ్యింది. ఆమె తాను రాజకీయాల్లోకి రమ్మంటే వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కారణం తనకది అంత ప్రాధాన్యతాంశం కాదని కూడా చెప్పుకొచ్చారు బ్రాహ్మణి. మరి చంద్రబాబు అడిగినా మీరు రాజకీయాల్లోకి రారా అంటే ఏమంత ఇంట్రస్ట్ లేదని అన్నారు బ్రాహ్మణి.

ఇలాంటి అనాసక్తి కలిగి ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే వారిలో జయలలిత, సోనియాగాంధీ, ఆ మాటకొస్తే భారతీరెడ్డి వంటి వారెవరికీ పొలిటిక్స్ అంటే ఏమంత ఇంట్రస్ట్ కానే కాదు. జయలలితకు ఆ మాటకొస్తే సినిమాలే ఇంట్రస్టింగ్ టాపిక్ కాదు. కానీ తన తల్లి కోరిక మేరకు ఆమె బలవంతానా సినిమాల్లోకి వచ్చి ఆ కాలపు అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగారు. అటు పిమ్మట ఎంజీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆమె, ప్రచార కార్యదర్శిగా నియమితులవడం. ఆపై ఆయన మరణించాక యాక్టివ్ పాలిటిక్స్ లో అడుగు పెట్టడంతో సీఎం స్థాయికి చేరి.. డీఎంకేతో కరుణానిధితో ఢీ అంటే ఢీ అన్నారు.

ఇక సోనియాగాంధీకి కూడా రాజకీయ రంగం ప్రాధాన్యతాంశం ఏమీ కాదు. ఆమె రాజీవ్ గాంధీ అనే రాజకీయ కుటుంబంలోని వ్యక్తి ప్రేమలో ఉన్నానన్న విషయం ఆలస్యంగా గ్రహించారు. అప్పటికీ తన భర్తతో కలసి ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఫైనల్ గా ఇందిర మరణం తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాజీవ్ ప్రధాని కావడం.. ఆపై ఆయన మరణం తర్వాత ఒక గ్యాప్ ఏర్పడ్డం. కాంగ్రెస్ పార్టీ పతనావస్త మొదలవుతుందనగా.. సోనియా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఎంట్రీ ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఇటు యూపీఏ చైర్ పర్సన్ గా చక్రం తిప్పడం మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఎదిగారామె.

వైసీపీ అధినేత జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి కూడా ఏమంత రాజకీయాసక్తులు లేవు. ఇక్కడుంటే జైల్లో పెడుతున్నారు. కాబట్టి ఏ విదేశాలకో వెళ్లి సెటిలవుతామని తాను తన భర్తను కోరినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారామె. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రి సతీమణిగా ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.

మొన్న చంద్రబాబు జైల్లో ఉన్నపుడు అత్త భువనేశ్వరితో కలసి ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు బ్రాహ్మణి. ఆ తర్వాత ఆమె రాజకీయ అరంగేట్రంపై కూడా పలు కామెంట్లు వినవచ్చాయి. ఈలోగా చంద్రబాబు రిలీజ్ కావడం. కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించడం. తన భర్త లోకేష్ కూడా మంత్రిగా బిజీ కావడంతో ప్రస్తుతం బ్రాహ్మణి ఫుల్ హ్యాపీ. 

ఈ లీజర్ లో ఆమె హెరిటేజ్ వ్యవహారాలు పట్టించుకుంటున్నారు. పాడి రైతుల కోసం తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ తృప్తి తనకు చాలంటున్నారామె. అయితే రాజకీయ అవసరాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు. కాబట్టి ఒక వేళ ఆమె ఇంట్రస్ట్ లేదన్నా.. సరే ఫ్యూచర్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటారు పలువురు.

By
en-us Political News

  
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలు కనిపిస్తే పేల్చేస్తామన్న హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.