అఖిలేష్ యాదవ్ బాటలో నారా లోకేష్

Publish Date:May 18, 2012

Advertisement

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాటలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పయనించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ ఇబ్బందుల్లో ఉన్నపుడు అతని తనయుడు అఖిలేష్ యాదవ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ మొదట పార్లమెంట్ కు ఎన్నికయి తర్వాత యు.పి.కి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తన తండ్రి చంద్రబాబు నాయుడికి ఇకపై చేదోడు వాదోడుగా ఉండాలని నారా లోకేష్ నిర్ణయించారు. తండ్రి అనుమతితో పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షించడం ఇప్పటికే ప్రారంభించారు.

 

 

అయితే ఆయన నేరుగా పార్టీ ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటి వద్దకే తన సలహాదారులను రప్పించుకుని మంత్రాంగం నిర్వహిస్తున్నారు. టిడిపి పార్టీ కార్యాలయ ఇన్ ఛార్జి తొండెపు దశరథ జనార్థన్, శాసనమండలి సభ్యుడు యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, జయరామ్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన రావు తదితరులను లోకేష్ కు సలహాదారులు గా చంద్రబాబు నియమించారు. వీరు వారంలో రెండు రోజులు లోకేష్ తో కలిసి మంతనాలు సాగిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నగదు బదిలీ పధకాన్ని తన మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పథకానికి అప్పట్లో విశేష ప్రచారం కూడా కల్పించారు. ఈ పథకాన్ని లోకేష్ రూపొందించారని చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఒకవేళ గెలిచి ఉంటే ఈ పథకం వల్లే తాము గెలవగలిగామనే ప్రచారాన్ని తెలుగుదేశం నేతలు చేసి నారా లోకేష్ ను ఆకాశానికెత్తేసేవారే. ఈ ఎన్నికల తర్వాత లోకేష్ స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ వ్యవహారాలకే చాలాకాలం పరిమితమయ్యారు.

 

అయితే నందమూరి కుటుంబసభ్యుల మద్దతు అనిశ్చితంగా ఉండడంతో చంద్రబాబు నాయుడు ఇకపై పార్టీ వ్యవహారాల్లో నారా లోకేష్ సహాయ సహకారాలను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. నందమూరి ఫ్యామిలీలో ఒక్క బాలకృష్ణ మినహా ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదు. అయితే బాలకృష్ణ రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతున్నప్పటికీ చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల ప్రచార సభల్లో బాలకృష్ణ పాల్గొన్నప్పటికీ పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదనే భావనతో చంద్రబాబు ఉన్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్. సభలకు జనం బాగానే వచ్చారు. అతని ప్రసంగాలు కూడా ఆకట్టుకున్నాయి. కానీ అతను ఎదిగితే తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోకేష్ కు రాజకీయ పాఠాలు నేర్పిస్తున్నట్లు తెలిసింది.

By
en-us Political News

  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.