పాపం కేశినేని నాని.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!

Publish Date:Jan 20, 2024

Advertisement

విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్న మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి మారిన తర్వాత  ఆయన పట్ల అప్పటి వరకూ ఉన్న ఆ భావన అందరిలోనూ మటుమాయం అయ్యింది. 

అవధులు లేని అహంభావం, పొగరుబోతుతనం తప్ప ఆయనలో ఆలోచన లేదని వైపీపీలో చేరిన తరువాత ఆయన అత్యంత అప్రాధాన్యంగా ఆ పార్టీలో మెలుగుతున్న తీరుతో అందరికీ అవగతమైంది.  కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు, స్వతంత్రంగా వ్యవహరించేవారు. సీఎంఓ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడినా, తాను నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడతానని చెప్పగలిగే స్వేచ్ఛ ఉండేది.  అంతే కాదు ఆయన పార్టీలో సీనియర్లను కూడా పెద్దగా ఖాతరు చేసే వారు కాదు. తనకు తాను చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా భావించుకునే వారు.  ఆ కారణంగానే పార్టీలో సీనియర్లు చాలా మంది ఆయనకు దూరంగా మెలిగే వారు.

 అయితే అదంతా కేశినేని బిల్డప్ మాత్రమేనని నాని వైసీపీ గూటికి చేరిన రోజుల వ్యవధిలోనే బట్ట బయలైపోయింది. విజయవాడ ఎంపీగా తనతోపాటు.. మరో ఐదుగురు నేతలకు, అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన వైసీపీ అధినేతకు సిఫార్సు చేశారట. కానీ ఆయన సిఫారసు చేసిన వాటిలో తిరువూరు వినా  మరో సీటు ఇచ్చేందుకు ససేమిరా అన్న సర్దుకు పోయారు. ఇక ఇటీవల బెజవాడలో జరిగిన పలు వైసీపీ కార్యక్రమాలకు కేశినేని నాని హాజరయ్యారు. మామూలుగా అయితే అక్కడ ఆయన పరిస్థితి గుంపులో గోవింద మాదిరిగానే ఉంది.  

తెలుగుదేంలో ఉన్నప్పుడు విజయవాడలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎంపీ హోదాలో ఉన్న నానికి సముచిత ప్రాధాన్యత లభించేది. వేదికపై ఎన్టీఆర్ పక్కనే స్థానం కూడా లభించేది. అయితే ఇప్పుడు  నానికి  వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యతా లభించడం లేదు. విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉండి, మీడియాతో మాట్లాడితే… స్వతంత్ర భావాలుండి, ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేశినేని నాని మాత్రం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెనుక నిలబడి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  కేశినేని నానికి కూడా ఆ విషయం ఇప్పటికే స్పష్టంగా అర్ధమై ఉంటుంది. అయితే కోరి కొనుక్కున్న కొరివి కనుక మండినా బయటపడే అవకాశం లేదు. లోలోన మాత్రం ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న పాట పాడుకుంటూ ఉండే ఉంటారు.

ఆ అవమానాలే అలా ఉంటే తాజాగా విజయవాడలో గురువారం జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీగా ఇవ్వాల్సి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నానిని మరింత ఘోరంగా అవమానించింది. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అంటూ విషాద గీతాలు పాడుకుంటూ, వైసీపీ రాజ్యాంగానికి అనుగుణంగా అణిగిమణిగి ఒదిగి ఒదిగి ఉండేందుకు కేశినేని నాని మానసికంగా సిద్ధమైపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.