శ్రీశైల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం
Publish Date:Aug 22, 2025
Advertisement
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు ఐదవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 650 మంది చెంచు గిరిజన ముత్తైదువులు, అలానే 1000 మంది సాధారణ మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రతం లో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రతపూజా సామగ్రిని అలానే చీర,రవిక వస్త్రం కూడ అందజేసి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్వీఘ్నంగా జరిపించారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న చెంచు గిరిజన మహిళలకు, సాధారణ మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా చీర,రవిక పూలు, గాజులు, ప్రసాదం అందజేసి శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మన వైదిక సాంప్రదాయంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుందనీ ఈవో తెలిపారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గిరిజన చెంచు సోదరిమనులకు అవకాశం కల్పించామన్నారు. చెంచు ముత్తైదులను ఎంపిక చేయడంలో ఐటీడీఏ అధికారుల సహకారం అందించారని తెలిపారు, ఐటీడీఏ పీవో శివప్రసాద్ మాట్లాడుతూ దేవస్థానం గిరిజన చెంచు భక్తులను వరలక్ష్మి వ్రతాలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం పట్ల దేవస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. మూడు జిల్లాల నుండి పలు గూడెములలోని గిరిజన చెంచు భక్తులను ఈ వరలక్ష్మి వ్రతానికి తీసుకొని రావడం జరిగిందన్నారు వరలక్ష్మి వ్రతంలో శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవో శివప్రసాద్ దంపతులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/nandyal-district-25-204805.html





