నల్సార్ విద్యార్థులకు మద్దతుగా 441 మంది పూర్వ విద్యార్థులు..!

Publish Date:Aug 14, 2026

Advertisement

 

BCI తీరుపై తీవ్ర అభ్యంతరం..!

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులు, అధ్యాపకులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీసుకున్న చర్యలపై 441 మంది నల్సార్ పూర్వ విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులు, అధ్యాపకుల పై విచారణకు ఆదేశించ డం, 2026 బ్యాచ్ విద్యార్థుల అడ్వకేట్ ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయడం వంటి చర్యలను ఖండిస్తూ బీసీఐ చైర్మన్ మానన్ కుమార్ మిశ్రాకు బహిరంగ లేఖ రాశారు. నల్సార్ కాన్వొ కేషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆగస్టు 13న BCI రెండు లేఖలు జారీ చేసింది. 

మొదటి లేఖలో 2026లో నల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అడ్వకేట్లుగా ఎన్‌రోల్ చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థులు, అధ్యాప కులు, ఇతర వ్యక్తుల వివరాలతో నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను కోరింది. అయితే తీవ్ర విమర్శల నేపథ్యంలో అదే రోజు BCI తన నిర్ణయాన్ని సవరించి, 2026 బ్యాచ్‌లోని విద్యా ర్థులందరూ తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేసు కునేందుకు అనుమతిం చింది. అనంతరం 2026 బ్యాచ్ విద్యార్థులకు ఎలాంటి పాత్ర లేదని తేలడంతో విచారణను పూర్తిగా ముగిస్తున్నట్లు BCI చైర్మన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నల్సార్ పూర్వ విద్యార్థులు రాసిన లేఖలో “విద్యార్థుల వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రశ్నించ డం, విశ్వవిద్యాలయ స్వయంప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడం సరికాదు” అని పేర్కొన్నారు. క్యాంపస్‌లో విద్యార్థులు తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కులో భాగమని స్పష్టం చేశారు.

BCIకి న్యాయ విద్య ప్రమాణాలను నిర్దేశించే బాధ్యత ఉన్నప్ప టికీ, యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల భావ వ్యక్తీకరణను నియంత్రించే అధికారం లేదని పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, అధ్యాపకు లపై ‘విచ్ హంట్’ తరహా చర్యలకు బదులుగా చర్చలు, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరారు.“న్యాయ విద్య అనేది ప్రశ్నించడం, ఆలోచిం చడం, భిన్నాభిప్రాయా లను వ్యక్తం చేయడం నేర్పాలి. అలాంటి వాతా వరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వేధింపుల బెదిరిం పులతో విద్యార్థులను మౌనం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని వారు లేఖలో పేర్కొన్నారు.

Nalsar students, Bar Council of India, BCI Chairman Manan Kumar Mishra, NALSAR CONVO CATION, Judge Justice Suryakant

By
en-us Political News

  
వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముందుగానే..!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సాయంత్రం 6 గంట లకు రాజ్‌భవన్‌ (లోక్‌భవన్‌)లో తెలంగాణ గవర్నర్‌ ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
హైదరాబాద్ పోలీస్‌లకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు..!
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.