సమైక్యాంధ్రవాదికి కమలం పార్టీలో తెలంగాణ బాధ్యతలా?

Publish Date:Mar 11, 2023

Advertisement

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి   నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి చర్చల ప్రక్రియ పూర్తయ్యిందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే ఆయన కమలం గూటికి చేరతారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. పేరుకైతే కాంగ్రెస్ లో ఉన్నారు కానీ పార్టీలో ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తో విభేదించి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ స్థాపించి 2014 ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నది లేదు. రాహుల్‌గాంధీ ఏపీ-తెలంగాణలో పాదతయాత్ర సాగినప్పుడు కూడా ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. చివరాఖరికి ఆయన తన సొంత జిల్లా అయిన చిత్తూరులో కూడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.  అయితే ఆయన  సోదరుడు నల్లారి కిశోర్‌రెడ్డి టీడీపీలో చురుకుగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా. అంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులలో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు ప్రకటించి రాజకీయ సన్యాసం తీసుకుంటే.. ఎటువంటి ప్రకటనా లేకుండా ఇంతకాలం అదే పని చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు  అటువంటి ఆయన ఇప్పుడు బీజేపీలో చేరి రాజకీయాలలో క్రియాశీలంగా మారేందుకు సమాయత్తమౌతున్నారు. అయితే ఆయనకు బీజేపీలో ఏపీ బాధ్యతలు కాకుండా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, సమైక్యాంధ్ర పేరుతో పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించడం బీజేపీకి ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. అయితే బీజేపీ మాత్రం స్వయంగా తెలంగాణ జాతిపితగా తనను తాను అభివర్ణించుకున్న కేసీఆరే తెలంగాణ వాదానికి స్వస్తి చెప్పి జాతీయ వాదమంటూ ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరణకు ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితుల్లో ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి వాదనలకు తావే ఉండదని   భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అందుకే తెలంగాణలో బీజేపీకి రెడ్డి సమాజిక వర్గాన్ని చేరువ చేసే బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఏది ఏమైనా ఒక మాజీ సీఎం పార్టీలో చేరారంటే.. అది బీజేపీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా ఉన్నారా లేదా అన్నది తరువాత ఇప్పటి పరిస్థితుల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తి కమలం గూటికి చేరారు అని చెప్పుకోవడం ఎంత కాదనుకున్నా బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నందునే చేరికకు ఇతర పార్టీల నేతలు ఉత్సుకత చూపుతున్నారన్న ప్రచారమైనా జరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.  

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.