వైసీపీ నుంచి ప్రసన్నను సస్పెండ్ చేయాలి : అనిత
Publish Date:Jul 8, 2025
                                     Advertisement
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హోం మంత్రి స్పందించారు. ప్రసన్న కుమార్ నువ్వు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను నీ తల్లికి చూపించు మీరు మాట్లాడిన మాటల్లో తప్పులేదని ఆమె అంటే మాకు చెప్పడి మేం మాట్లాడటం మానేస్తాం అని హోం మంత్రి అన్నారు .మహిళల గౌరవాన్ని జగన్ కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 11 సీట్లు వచ్చినప్పటికీ వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై.. ప్రసన్నకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనపై కూడా ప్రసన్న కుమార్ ఇలాగే ఇష్టానుసారంగా మాట్లాడారని ఆమె గుర్తుచేశారు. వైసీపీలో మహిళలను అగౌరవపరిచే సంస్కృతి ఉందని, సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు అనేక మంది నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆమె విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పర్యటనలో భాగంగా ఆమె సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి డిమాండ్. తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో కోవూరులో జరిగిన అక్రమాల గురించి మాట్లాడుతుంటే మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై నోరు పారేసుకున్న ప్రసన్నను మహిళా సమాజం క్షమించదన్నారు.
http://www.teluguone.com/news/content/nallapareddy-prasannakumar-reddy-39-201522.html




 
