జూన్ 1 నుంచి నాగబాబు ఉత్తరాంధ్ర టూర్

Publish Date:May 30, 2022

Advertisement

నటుడు నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టనున్నారు. జనసేన పార్టీ విధానాలు, పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసే లక్ష్యంతో ఆయనీ పర్యటన చేపడుతున్నారు. ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిన నేపథ్యంలో ప్రజలలో  మరింత మమేకమయ్యే విధంగా జనసేన ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

అందులో భాగంగగానే నాగబాబు ఉత్తరాంధ్రపర్యటన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటికే బాదుడే బాదుకు, మహానాడు కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నద్ధతను ఘనంగా చాటింది. అదే విధంగా గడప గడపకూ, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ద్వారా వైసీపీ కూడా జనం బాట పట్టింది.

దీంతో జనసేన కూడా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలకు   నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో శ్రీకారం చుట్టనుంది. జూన్ 1న శ్రీకాకుళంలో నాగబా బు పర్యటిస్తారు, ఆ తరువాత 2 న విజయనగరం, 3న విశాక జిల్లాలలో పర్యటించనున్నారు.

నాగబాబు పర్యటనతో ఉత్తరాంధ్రలో జనసేన కార్యక్రమాలు జోరందుకుంటాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్రప్రర్యటన అనంతరం నాగబాబు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ప్రకటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. 

By
en-us Political News

  
మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఊహించని రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తమిళనాడులోని మదురైలో జరిగిన ఒక సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా న్యాయస్థానానికి హాజరయ్యారు.
వ్యవసాయ రంగంలో సరైన ఆలోచన, పట్టుదల ఉంటే ఏ విధంగా అద్భుతాలు సృష్టించవచ్చో ఒడిశాకు చెందిన ఓ యువ రైతు ఆచరణలో నిరూపించి చూపించారు.
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సోనియా గాంధీ రాసిన సంచలన ఆత్మకథ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.