నాగబాబు, నారాయణ వివాదం టీ కప్పులో తుపాను

Publish Date:Jul 20, 2022

Advertisement

మెగా స్టార్  చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఉవ్వెత్తున లేచిన వివాదం టీ కప్పులో తుపానుగా చల్లారిపోయింది. నటుడు చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ ఇటీవల విమర్శలు గుప్పించారు. చిరంజీవిని రంగులు మార్చే ఊసరవిల్లితో పోల్చారు.   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ హాజరైన సంగతి విదితమే. 

ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఊసరవిల్లిలా రంగులు మార్చే చిరంజీవిని కాకుండా అల్లూరి సీతారామరాజుపై సినిమా నిర్మించి, నటించిన సూపర్ స్టార్ కృష్ణకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కల్యాణ్ ను ల్యాండ్ మైన్ తో పోల్చి ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదని సెటైర్లు వేశారు. దీంతో నారాయణపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే మరింత తీవ్రంగా స్పందించారు. సీపీఐ నారాయణ అన్నం తినడం మానేసి చాలా కాలమైందనని అంటూ ఆయన కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారంటూ విమర్శించారు.  

మెగా అభిమానులంతా కలిసి ఆయన చేత గడ్డి తినడం మాన్పించి అన్నం తినడం అలవాటు చేయాలని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై తను చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతున్న నేపథ్యంలో సీపీఐ నారాయణ బేషరతుగా క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.  

అదే సమయంలో తన వ్యాఖ్యలను కేవలం భాషా దోషంగా భావించి మన్నించాలని కోరారు. నారాయణ క్షమాపణులు కోరి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో మోగా బ్రదర్ పవన్ కల్యాణ్ శాంతించారు. క్షమాగుణం జనసైనికుల ధర్మం అని పేర్కొన్నారు.

అలాగే తప్పు ఎవరు చేసిన క్షమించమని కోరితే క్షమించాలని పేర్కొన్నారు. సీపీఐ నారాయణ వయస్సును దృష్టిలోఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని జనసైనికులకు పిలుపు నిచ్చారు.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక 14వ సంచికలో తాజా రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ జరిగింది.
సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం అన్నది సాధారణమే. అలాగే జగన్ కూడా పర్యటిస్తున్నారు అనుకోవడానికి లేకుండా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో నూతన విగ్రహ ప్రతిస్ఠాపన చేశారు.
డబ్బున్న వారికి పోలీసు సెక్యూరిటీ ఎందుకు? మీ డబ్బు శక్తి వాడండంటూ, పోలీసు భద్రత ఇప్పుడు హోదా గా మారిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
వైసీపీ మాత్రం కల్తీ జరిగిందన్న విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటే నానా హంగామా చేస్తోంది.
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.