Publish Date:Dec 15, 2025
జనసేన ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమని సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ కార్యకర్తగానే ఉంటాననీ, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ తన సోదరుడు పవన్ కల్యాణ్ కు అండగా, సహాయంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీగా చాలా హ్యాపీగా ఉన్నానన్న నాగబాబు, తనకు ఇది చాలని అన్నారు. వచ్చే ఎన్నికలే కాదు, అసలు ఏ ఎన్నికలలోనూ తాను పోటీ చేయనన్నారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం (డిసెంబర్ 14) శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనన్న ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. వాస్తవానికి తాను ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే.. 2024 ఎన్నికలలోనే పోటీకి దిగేవాడనన్న ఆయన.. తాను స్వయంగా నిర్ణయించుకోవడం వల్లే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.
అయితే వాస్తవానికి నాగబాబు 2024 ఎన్నికలలో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగాలని భావించారు. అందుకు అన్ని విధాలుగా సంసిద్ధమయ్యారు కూడా. అయితే కూటమి పొత్తు ధర్మంలో బాగంగా ఆయన అనివార్యంగా విరమించుకోవలసి వచ్చింది. అనకాపల్లి నుంచి అవకాశం లేదన్నది నిర్ధారణ అయ్యాక కూడా నాగబాబు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే పొత్తు ధర్మం కారణంగా అప్పట్లో ఆ అవకాశం కూడా దక్కలేదు. సరే వచ్చే ఎన్నికల్లో అయినా శ్రీకాకుళం నుంచి బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన తరచుగా శ్రీకాకుళంలో పర్యటనలు చేస్తూ వచ్చారు. ఎంత ఎక్కువగా అంటే గత ఏడాది కాలంలో ఆయన శ్రీకాకుళంలో 12 సార్లు పర్యటించారు. దీంతో నాగబాబు కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడి సీటుపై కన్నేశారంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇదో పెద్ద వివాదంగా పరిణమించే అవకాశాలున్నాయని గ్రహించిన నేపథ్యంలో నాగబాబు శ్రీకాకుళం వేదికగా తనకు అసలు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశమే లేదంటూ ప్రకటించి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nagababu-announce-no-intrest-in-contesting-direct-elections-39-211027.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.