నాన్న పులి.. జ‌గ‌న్‌ పిల్లి... లోకేష్‌

Publish Date:Oct 21, 2022

Advertisement

పులి, పిల్లి.. వేరు వేరు వేట తీరు జంతువులు. ఎంతోధైర్యంగా వేటాడ‌ట‌మే కాదు అంద‌రిని చెప్పుచేతల్లో నూ పెట్టుకుంటూ అవ‌స‌ర‌మ‌యిన‌పుడు దాడుల‌కు వెనుకాడ‌క వేగంగా వ్యూహాత్య‌కంగానూ వెళ్లేవారిని పులి లాంటోడ్రా అంటారు.. ఎవ్వ‌రూ చూడ‌ని స‌మ‌యంలో విర్ర‌వీగుతూ త‌నంత‌టివాడు లేడ‌నుకుని వ్య‌వ‌హ రిస్తూ ఒక్క‌రి ద్ద‌రు ఎదురు ప‌డ‌గానే తోక‌ముడుచుకుని ఇంట్లోనే ర‌హ‌స్యంగా సంచ‌రించేవాడిని పిల్లి అనే అంటారు. పులి చంద్ర‌బాబు, పిల్లిగా జీవిస్తున్న‌ది మాత్రం జ‌గ‌న్‌! 

టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ అనంత‌రం  పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి, రాష్ట్రాన్ని ప‌రుల చేతుల్లోకి పోకుండా చేయ‌డానికి స‌మ‌స్త భారాన్ని మోసి రాజ‌కీయ చ‌తుర‌త‌తో అధికారంలోకి తెచ్చి త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తూ గొప్ప మార్గ‌ద‌ర్శ‌కునిగా నిలిచిన వాడు చంద్ర‌బాబు. ఆయ‌న టీడీపీని అధికారంలోకి తీసుకు రావ‌డ‌మే కాకుండా మంచిపాల‌నాద‌క్షునిగా అంద‌రి మ‌న్న‌న‌లూ పొంద‌డం గ‌మ‌నార్హం. ప‌డ‌నివారు, రాజ కీయాల్లో ఎద‌గ‌లేనివారు అనేకానేకులు  ఆయ‌న్ను వెన్నుపోటుదారుడు అదే ఆయన అస్త్రంగా ప్ర‌యో గించి అధికారంలోకి వ‌చ్చార‌న్న అప‌వాదులు మొన్నీ మ‌ధ్య వ‌ర‌కూ భ‌రిస్తూనే వచ్చారు. కానీ  అప్ప‌టి ఆగ‌స్టు సంక్షోభంలో పార్టీని చంద్ర‌బాబు  క‌నుక  నాయకత్వం వ‌హించి ముంద‌డుగు వేయ‌కుంటే ఇప్ప‌టి ప్ర‌గ‌తి అసాధ్య‌మ‌న్న‌ది క్ర‌మేపీ ప్ర‌జ‌లు, రాజీయ నాయ కులు గుర్తించారు. అధికారం కేవ‌లం త‌న పార్టీ కోసమే కాకుండా రాష్ట్ర ప్ర‌గ‌తిని ల‌క్ష్యంగా పెట్టుకుని పాల‌న సాగించారు. టెక్నాల‌జీకీ పెద్ద పీట వేస్తూ అప్ప‌టి స‌మైక్యాంధ్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ని  టెక్ కేంద్రంగా రూపుదిద్ద‌డంలో ఆయ‌న కృషి అన‌న్య సామాన్య‌మ‌ని ఇప్ప‌టికీ వేనోళ్ల కీర్తిస్తున్నారు. అనేక రాజ‌కీయ మ‌లుపులు, తిరుగుబాట్లు త‌ట్టుకుంటూ పాల‌నాప‌రంగా గొప్ప వ్యూహ‌క‌ర్త‌గా, విజ‌న‌రీగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్నారు చంద్ర‌ బాబు. విదేశీ సంస్థ‌లు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం, నిరుద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌డం, బ‌డుగు వ‌ర్గాల‌ను ఆదుకోవ‌డంలో చేసిన కృషిని దేశం గుర్తించింది. ఆయ‌న క్ర‌మేపీ జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పే స్థాయికి ఎద‌గ‌డంలో ప్ర‌త్య‌ర్ధుల‌ను, శ‌త్రువుల‌ను పులిలానే వేటాడా ర‌ని అంటారు. 

ఎవ‌రు ఎన్ని వ్య‌తిరేక ప్ర‌చాచాలు చేసిని, ఏమ‌న్నా పట్టించుకోకుండా  త‌న సామ‌ర్ధ్యంతో కేంద్రంలోనూ అంతే గౌర‌వ మ‌ర్యాద‌లు అందుకున్నారు. ఎన్‌డీఏలో కీల‌క‌పాత్ర వ‌హించ‌డంతో పాటు దేశ రాజ‌కీయాల్లో ఆయ‌న రాజ‌కీయ ముద్ర‌ను వేయ‌డంలో ఇత‌ర జాతీయ పార్టీల వారూ ఆయ‌న‌తో చేతులు క‌లిపేందుకు ఆస‌క్తి చూపారు. కానీ ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. అంత‌టి వ్యూహ‌క‌ర్త‌, దూర‌దృష్టి ఉన్న నాయ‌కుడూ అధికారం కోల్పోయారు. అయినా మొక్క‌వోని ధైర్య‌సాహ‌సాల‌తో పార్టీని మాత్రం ప‌టిష్టంగా రాష్ట్రంలో విస్త రించేలా నాయ‌కుని ల‌క్ష‌ణాలు మ‌రింత ప్ర‌ద‌ర్శించి మ‌ళ్లీ రాజ‌కీయరంగంలో త‌న ముద్ర‌ను వేశారు. రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న అభిప్రాయాలు అన్ని వ‌ర్గాల నుంచి విన‌వ‌చ్చా యి.  రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఆయ‌న అధికారాన్ని అంతా ఆశి స్తున్నారు. ఆయ‌న శ‌క్తి సామ‌ర్ధ్యాలు అవ‌స‌ర‌ మ‌న్న‌ది ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. పార్టీ అభిమానులు, నాయ‌కులు మ‌ళ్లీ ఉద్య‌మించారు. అధి కారంలోకి వ‌చ్చేం దుకు ఇక ఆట్టే స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 

వైఎస్సార్  మ‌హానేత అని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న కుమారునిగా వై.ఎస్‌.జ‌గ‌న్ అంతా ప్ర‌జ‌ల మ‌న‌సులో నిల‌వ‌లేక‌పోయారు. ప్ర‌జాద‌ర‌ణ లేని నాయ‌కుడు ఆట్టేకాలం మ‌న‌లేడు. అధి కారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొత్త గా కొమ్ములొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించి తోచిన విధంగా వ్య‌వ‌హ‌రిం చ‌డం ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. అధికారంలోకి రావ‌డానికి చేసిన పాద‌యాత్ర‌, ఇచ్చిన భారీ హామీల‌న్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయి కేవ‌లం పేర్లు, ప్ర‌చారం మాత్ర‌మే మిగిలింది. చేప‌ట్టిన ప్ర‌తీ కార్య‌క్ర‌మం ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, అదంతా కేవ‌లం భ్ర‌మ అనేది త్వ‌ర‌లోనే తేట‌తెల్ల‌మ‌యింది. అధికారం లోకి వ‌చ్చి మూడేళ్లు గ‌డిచిపోయినా ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొంద‌క‌పోగా వారి నుంచి ఛీత్కారం ఎదుర్కొం టున్న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ రికార్డుల్లోకి ఎక్కారు. అన‌తికాలంలో ఉన్న‌త ప‌ద‌వికి మ‌రింత ప్ర‌తిష్ట తీసు కురావ‌ల‌సిన యువ నాయ‌కుడు అధోగ‌తికి దిగ‌జార‌డం ప్ర‌జ‌లు, తోటి నాయ‌కులు గ‌మ‌నిస్తున్నారు.  కేవ లం ప్ర‌తిప‌క్షాల మీద విరుచుకుప‌డ‌టం, అవ‌మానించ‌డం త‌ప్ప ప్ర‌త్యేకించి చేసిన‌దేమీ క‌న‌ప‌డ‌దు. దీనికి తోడు ఎమ్మెల్యేలు, మంత్రులూ అంద‌రూ నాయ‌కునికి మ‌ర్యాద‌స్తుల‌మ‌న్న సీన్ చూపించి క్ర‌మేపీ త‌మ నిజరూప ద‌ర్శ‌నం చేయించారు. చాలామటుకు ఎవ్వ‌రూ మామూలు మ‌నుషులు ఉప‌యోగించ‌ని భాష‌లో మాట్లాడ‌డం, ఎదుటివారిని విమ‌ర్శించ‌డం, తిట్ట‌డంలో డాక్ట‌రేట్లు పుచ్చుకున్న తీరే ప్ర‌ద‌ర్శించ డం చూస్తున్నాం. ఇది క‌నీ వినీ ఎరుగ‌ని కాలం అంటున్నారంతా. స‌ద్విమ‌ర్శ అనేది నాయ‌కులు, మంత్రులు మ‌ర్చిపోయారు. ఎవ‌రికివారే...అన్న నానుడిని మంత్రులు రుజువుచేస్తున్నారు. చాలా స్వేచ్ఛగా కామెంట్లు చేసేస్తున్నారు. ముఖ్య‌మంత్రితో క‌నీసం అవ‌గాహ‌న లేన‌ట్టుగానే క‌న‌ప‌డుతున్నారు. దేనికి కామెంట్లు చేస్తున్న‌దీ తెలీని స్థితిలో ఉన్నారు. క్ర‌మేపీ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది పాల‌నా .. ఇత‌న్ని ముఖ్య‌మంత్రి అనాలా.. అని ప్ర‌శ్నిస్తున్నారు. 

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ ప్ర‌భుత్వం అంటూ మూడే ళ్ల పాల‌న త‌ర్వాత ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు వెళుతోన్న మంత్రు లు, ఎమ్మెల్యేలను ప్ర‌జ‌లు తిట్టిపోస్తు న్నారు. క్ర‌మేపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల ముందుకు మంత్రు ల‌ను త‌రుముతూ తాను మాత్రం ప్యా లెస్‌కే ప‌రిమిత‌మ‌యి లోప‌ల్లోప‌లే దాక్కున్న పిల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ యువ‌నేత నారా లోకేష్ అన‌డం స‌రిగ్గా స‌రిపోతుంది. జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. బ‌య‌టికి వ‌స్తే ఏంద‌న్నా జ‌గ‌న‌న్నా అని నిల‌దీస్తార‌న్న భ‌యం తినేస్తోంది. మంత్రుల‌ను చూడ్డానికి కూడా ఇష్ట‌ప‌డ‌టం లేదు. వేసిన అన్ని లెక్కలు, లెక్క‌ల మాస్ట‌ర్లంతా జ‌గ‌న‌న్నా ఈసారి మూటా ముల్లూ స‌ద్దుకోమనే అనేశారు. పార్టీ వ‌ర్గాలు దాదా పు చేతులెత్తేశాయి. మంత్రులు భ‌యం భ‌యంగానే ఉంటున్నారు. 2024 ఆట్టే దూరం లేదు. అప్ప‌టి వ‌ర‌కూ పీఠాన్ని ప‌ట్టుకుని చిన్న‌చిన్న ప‌నులు చేసుకుంటూ, సెల్ఫీలు దిగు తూ ఉండాల్సిందే త‌ప్ప గ‌ట్టి గా మ‌ళ్లీ నిల‌దొక్కుకునే య‌త్నాలు ఏమీ చేయ‌ల‌ని స్థితికి దిగ‌జారారు. పిల్లి గోడ దాటుతుంది. దాట డం చూస్తే దాక్కుంటుంది. 

జగన్మోహన్‌రెడ్డి ప్యాలెస్‌ పిల్లి. పిల్లి ఎప్పుడూ దాక్కుంటూ తిరుగుతుంది. పులిలా బయట తిరగదు. ఆయ న పొరపాటున బయటకు వస్తే షాపులు, ఇళ్లు మూసివేయిస్తారు. ఎవరూ లేకున్నా బయటకు వచ్చి చేతు లు ఊపుకుంటూ వెళతాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు.  అవును  జగన్‌ పిరికి వాడు. ఆయన ఏం చేయలేడు. దాక్కునే  ఉంటాడు. ఉండే కొద్దీ దానికి వెచ్చ‌గా బాగానే ఉంద‌నుకుని, అలానే ఉండిపోతాడు.  జ‌గ‌న్ కూడా అదే భావ‌న‌లో ప‌డిపోయాడా?  రాజ‌కీయ విశ్లేష‌కులు కావ‌చ్చ‌నే అంటున్నారు. 

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.