విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం
Publish Date:Mar 18, 2013
Advertisement
పరస్పర అంగీకార శృంగారానికి అవసరమైన వయసు 16కు తగ్గించాలని గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయించిన విషయం విదితమే. అయితే నెర న్యాయ (సవరణ) బిల్లు-2013కి సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన అఖిలపక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ, ఎస్పీతో పాటు వివిధ పార్టీలు పరస్పర అంగీకార శృంగార వయస్సును 18 నుండి 16కు తగ్గించాలనే నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీంతో ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం పరస్పర అంగీకార శృంగార వయస్సును 18గా కొనసాగేందుకు నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తాజాగా కొత్త బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వెంటపడి వేధించడం, ఇతరుల శృంగార కార్యకలాపాల్లోకి తొంగిచూడటం వంటి సెక్షన్లను ప్రభుత్వం నీరుగార్చింది. తాజా బిల్లు ప్రకారం తొలిసారి ఈ రెండు నేరాలకు పాల్పడినవారికి బెయిల్ తీసుకోవటానికి అవకాశముంటుంది. తరచుగా ఈ నేరాలకు పాల్పడితే మాత్రం బెయిల్ లభించదు. గరిష్టంగా ఐదేళ్ళ వరకు జెలు శిక్ష పడుతుంది.బహిరంగ ప్రదేశాల్లో స్త్రీని వివస్త్రను చేయటాన్ని శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ వచ్చారు. కాని బహిరంగ ప్రదేశం ప్రస్తావన దుర్వినియోగానికి గురవుతోందనే అభిప్రాయంతో తాజా బిల్లు ప్రకారం ఇంట్లోగానీ, రహస్య ప్రాంతంలో గానీ బలవంతంగా స్త్రీని వివస్త్రను చేస్తే శిక్షార్హ నేరంగా పరిగణించి ఈ నేరానికి పాల్పడిన వారికి ఏడేళ్ళ వరకు జైలుశిక్ష విధించవచ్చు.
http://www.teluguone.com/news/content/mutual-understanding-sex-age-limit-18-years-39-21727.html





