పొంగులేటి ప్రస్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ, గతంలో కేటీఆర్ నిర్వహించగా.. ఆ సమయంలో ఎన్ని అక్రమాలు జరిగాయో.. ఎన్నేసి అరాచకాలు నడిచాయో.. గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదివి వినిపించిన సంగతి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వయిరీ కూడా వేస్తామని సీఎం ప్రకటించిన సంగతీ విదితమే. ఈ అక్రమాల్లో తన సోదరుడి ప్రమేయం కూడా ఉండటంతో.. ఉలిక్కి పడ్డ హరీష్ రావు, ఈ శాఖామాత్యుడైన పొంగులేటిని తన టార్గెట్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ది ఉద్యోగాల కోసం వందలాది మంది ఫీజులు కట్టి మరీ రాస్తుంటే ఆ వచ్చే పది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వసూళ్ల వరకూ ఓకే.. మిగిలిన అందరి ఫీజులు వాపస్ ఎందుకివ్వరని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి తరఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధారణ ప్రయాణికుడు నిలబడి ప్రయాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్రశ్నలతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
Publish Date:Mar 31, 2026
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెసలుబాటు ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ విషయానికి వస్తే.. జీతభత్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాలు ఈ కొత్త విధానంలో కూడా కొనసాగుతాయి.
Publish Date:Mar 30, 2026
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయన తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు రాసిచ్చాక.. పడ్డ పాట్లు వర్ణనాతీతంగా వర్ణించారు ముఖ్యమంత్రి.
Publish Date:Mar 28, 2026
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Publish Date:Mar 27, 2026
స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మరీ చట్టసభలకు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
Publish Date:Mar 26, 2026
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
Publish Date:Mar 26, 2026
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
Publish Date:Mar 25, 2026
గత ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకుంటే ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నట్టేనని జనం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ కామెంట్ ఎంతగా పని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న.. బీజేపీని థర్డ్ ప్లేస్ లో పడేసింది. చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది బీజేపీ.
Publish Date:Mar 23, 2026
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజకవర్గం ఎంత చిన్నగా ఉంటే.. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను అంత వేగంగా పరిష్కరించగలుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.