ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ ఇక లేరు
Publish Date:Jul 13, 2015
Advertisement
తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో 1200 చిత్రాలకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో మల్లార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎం.యస్.విశ్వనాథన్ కేరళలో పాలక్కడ్ కు చెందిన ఇలప్పుళి గ్రామంలో 1928, జూన్ 24న జన్మించారు. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయనకి నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మనయంగాత్ సుబ్రమణియన్ మరణించడంతో తాతగారి వద్ద పెరిగారు. కానీ వారిది చాలా పేద కుటుంబం కావడంతో ఆ లేత వయసులోనే విశ్వనాథన్ గారు స్థానిక సినిమా హళ్ళలో తినుబండారాలు అమ్ముతూ జీవించాల్సిన భయానకమయిన దుస్థితి ఏర్పడింది. కానీ దాని వలన ఆయన సినీ ప్రపంచం వైపు ఆకర్షితులయ్యే అవకాశం కలిగింది. అప్పటి నుండే ఆయనకు సినిమాలలో నటించాలని, పాటలు పాడాలనే కోరిక మొదలయింది. ఆ తరువాత ఆయన అనేక నాటకాలలో నటించారు కూడా. కానీ ఆయనలో దాగి ఉన్న సంగీత ప్రతిభను గుర్తించిన నీలకాండ భాగవతార్ ఆయనను చేరదీసి సంగీతం నేర్పించారు. 1933 నుండి 1939సం.వరకు ఆయన వద్ద సంగీతం నేర్చుకొన్నారు. ఆ తరువాత ఆయన యస్.వి. వెంకట్రామన్, యస్.ఎం.సుబ్బయ్య, సి.ఆర్. సుబ్బురామన్, టి.ఆర్. రామమూర్తి, టిజి.లింగప్ప తదితర ప్రముఖ సంగీత విద్వాంసుల బృందాలలో పనిచేసి సంగీతంలో మెళుకువలు ఆకళింపు చేసుకొన్నారు. 1952లో సి.ఆర్. సుబ్బురామన్ ఆకస్మికంగా మరణించడంతో ఆయన వద్ద పనిచేస్తున్న సంగీత దర్శకుడు రామ్మూర్తితో కలిసి ఎం.యస్.విశ్వనాథన్ సుబ్బురామన్ అంగీకరించిన దేవదాసు,చండీరాణి, మరుమగల్ మొదలయిన సినిమాలకు సకాలంలో అద్భుతమయిన సంగీతం అందించడంతో ఆయన సినీ ప్రస్తానం మొదలయిందని చెప్పవచ్చును. వాటిలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన దేవదాసు సినిమాకు ఎం.యస్.విశ్వనాథన్ సంగీతం అందించారు. ఆ చిత్రంలో ‘జగమే మాయ బ్రతుకే మాయ’ అనే పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు. ఆయన తెలుగులో కేవలం 31 సినిమాలకు మాత్రమే సంగీతం అందించినప్పటికీ, తెనాలి రామకృష్ణ, ఆకలి రాజ్యం, మరో చరిత్ర, అంతులేని కధ, అందమయిన అనుభవం, చిలకమ్మా చెప్పింది, ఇది కధ కాదు,గుప్పెడు మనసు, కోకిలమ్మ వంటి సినిమాలకు అందించిన అపూర్వమయిన బాణీలతో తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఫిలిం ఫేర్ జీవిత కాల పురస్కారం(2001), పరమాచార్య అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమయిన కలైమణి అవార్డు వంటి అనేక అవార్డులు ఆయన అందుకొన్నారు. అజరామరమయిన సంగీతాన్ని అందించిన ఎం.యస్.విశ్వనాథన్ ఇకలేరు అని తెలియగానే సంగీత ప్రియులు చాలా బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు చెన్నైలో నిర్వహించబడతాయి. https://www.youtube.com/
http://www.teluguone.com/news/content/music-director-32-48298.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





