మూసీ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ స్పీడ్.. జనవరిలో ఫేజ్-1 పనులు ప్రారంభం.!
Publish Date:Nov 24, 2026
Advertisement
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్-1 పనులపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. ఫేజ్-1లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1ఏగా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 2027లో ఫేజ్-1 పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు తెలిపారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. అనంతరం మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జనవరి 2028 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. చెరువు అభివృద్ధి పనులతో పాటు, అందులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడికను కూడా పూర్తిస్థాయిలో తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిపై కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇది కూడ చదవండి: అటెండర్ మృతి.. KCR తీవ్ర విచారం.! మరోవైపు గండిపేట వద్ద నిర్మిస్తున్న ఆధునిక గోశాల పనుల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి 2027 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నగరాభివృద్ధికి కీలకమైన మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఈ సమీక్ష స్పష్టం చేస్తోంది. మీకు నచ్చవచ్చు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు.! మీకు నచ్చవచ్చు: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.! [ Musi River Rejuvenation, Musi Rejuvenation Project, Musi Project Phase 1, Hyderabad Development, Radial Roads, Urban Development, Himayatsagar, Osmansagar, Gandhi Sarovar, Mir Alam Tank, Mir Alam Lake Development, Desilting Works, Land Acquisition ]
http://www.teluguone.com/news/content/musi-river-rejuvenation-25-237889.html




