స్కూల్ పిక్నిక్లో విషాదం..ఊయల తగిలి పదేళ్ల విద్యార్థి మృతి.!
Publish Date:Nov 24, 2026
Advertisement
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సరదాగా గడపాల్సిన విహారయాత్రలో మృత్యువు ఊయల రూపంలో దూసుకొచ్చింది. పది మంది పిల్లలు ఎక్కిన భారీ ఇనుప ఊయల.. చివరకు పదేళ్ల అభిరామ్ ప్రాణాలను బలిగొంది. బిడ్డను సంతోషంగా పిక్నిక్కు పంపిన తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. హైదరాబాద్‌లోని నార్సింగికి చెందిన హ్యాపీ స్కాలర్స్ స్కూల్ విద్యార్థులను యాజమాన్యం విహారయాత్ర కోసం మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌కు తీసుకెళ్లింది. అక్కడ పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పార్క్‌లోని భారీ ఇనుప ఊయలపై సుమారు పది మంది చిన్నారులు ఎక్కారు. వెనుక వైపు నుంచి మరో నలుగురు విద్యార్థులు ఊయలను వేగంగా ఊపడంతో దాని వేగం క్రమంగా పెరిగింది. ముందుకు వేగంగా దూసుకెళ్లిన ఊయల.. అంతే వేగంతో వెనక్కి వస్తున్న సమయంలో సమీపంలో ఉన్న అభిరామ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంతో అక్కడున్న చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. ఊయల బలంగా తగలడంతో అభిరామ్ నుదురు, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థి యశ్వంత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పదేళ్ల అభిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాసేపటి క్రితం వరకు పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న పిక్నిక్ ప్రాంగణం.. ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదం వెనుక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వద్ద ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లల భద్రతను పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడ చదవండి: ఈ నెల 26 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.! తమ బిడ్డను స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి పిక్నిక్కు పంపిస్తే.. తిరిగి ప్రాణాలతో ఇంటికి రాలేదంటూ అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం, పార్క్ నిర్వాహకుల బాధ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన విషయం బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంతో బాలుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల విహారయాత్రల్లో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఒక్క క్షణం ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసింది. స్కూల్ పిక్నిక్ అంటేనే ఉత్సాహంగా ఎదురుచూసే చిన్నారుల మధ్య జరిగిన ఈ విషాదం.. అభిరామ్ కుటుంబానికి జీవితాంతం తీరని వేదనగా మిగిలిపోయింది. పిల్లలను నమ్మకంగా పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు వారి భద్రతపై ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. మీకు నచ్చవచ్చు: Hyderabad: సెప్టిక్ ట్యాంక్‌లో పడి ముగ్గురు మృతి.! మీకు నచ్చవచ్చు: Nvidia CEO జెన్సన్ హువాంగ్ ప్రసంగిస్తుండగా కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.! [ Abhiram, Lotus Pond Park, Moinabad Accident, Bachupally School Picnic, Happy Scholars School, Narsingi, School Picnic Tragedy, Swing Accident, Iron Swing Accident, Ten Year Old Boy Dead, Student Death ]
http://www.teluguone.com/news/content/abhiram-25-237860.html





