రక్షణ వలయంలోనూ హత్యల పరంపర!

Publish Date:Jul 9, 2022

Advertisement

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగుడు కాల్పులు జరిపారు. కాల్పులలో గాయాల పాలైన అబే చికిత్స పొందుతూ కన్ను మూశారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితగా దేశాల్లో ఒకటిగా ఉన్న జపాన్లో  మాజే ప్రధాని హత్యకు గురికావడం కలకలం రేపింది. జపాన్లో తుపాకీ వినియోగంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అలాంటి దేశంలో ఓ మాజీ ప్రధానిపైనే కాల్పులు జరపడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

ఇలాంటి దారుణ దుర్ఘటనలు జరిగిన ప్రతి సందర్భంలో, ఇలాంటి  దుర్మార్గం మరో మారు పునరావృతం కారాదని అందరం కోరుకుంటాము. కానీ, మళ్ళీ మళ్ళీ అలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశాధి నేతలు, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, హత్యకు గురైన సంఘటనలు తరచూ కాక పోయినా, అప్పుడప్పుడు  ఇక్కడో  అక్కడో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. భారత దేశం  విషయాన్నే తీసుకుంటే, ఇద్దరు ప్రధానులు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. మరో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పరాయి దేశంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.

ఇందిరాగాంధీ 1984, అక్టోబరు 31న ఢిల్లీలోని అధికార నివాసం వెలుపల ఉండగా... భద్రతా సిబ్బందిలో సిక్కు మతానికి చెందిన సత్వంత్‌ సింగ్‌, బియాంత్‌ సింగ్‌లు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇందిర ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 1991, మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటుగా మరికొందరు మృతిచెందారు.

సహజంగా, ప్రభుత్వాధినేతలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.  చుట్టూ అంగరక్షకులు ఉన్నప్పటికీ, అనేక మంది దేశాది నేతలు  దుండగుల కాల్పులకు బలైన దుర్మార్గపు దుర్ఘటనలు చరిత్ర పుటల్లో ఉండకూడనన్ని ఉన్నాయి. భారత ప్రధాని ఇందిరా గాంధీని అయితే అంగరక్షకులే హత్య చేశారు. అందుకే కావచ్చును, ఆమె హత్యకు గురై 40 ఎళ్లకు పైనే అయినా ఇంకా ఈనాటికీ  ఆ దురాగతాన్ని దేశ ప్రజలు మరిచి పోలేకుండా ఉన్నారు. 

అదలా ఉంటే  అది యాదృచ్చికమే కావచ్చును కానీ, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, భారత మాజీ ప్రధాని  రాజీవ గాంధీ  హత్యల మధ్య ఒక చిఒత్రమైన సారుప్యత కనిపిస్తోంది. ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో ఉండగానే హత్యకు గురయ్యారు. 

ఇందిరా గాంధీ, రాజీవ గాంధీ, షింజో అబే మాత్రమే కాదు, ఇలా హత్యకు గురైన దేశాధినేతలు ఇంకా ఉన్నారు. చిత్రం ఏమంటే, దేశ, ప్రభుత్వాధినేతలకు పూర్తి భద్రత ఉంటుంది.  చుట్టూ అంగరక్షకులు, మెటల్‌ డిటెక్టర్లు ఉన్నాసరే,  దాడులు జరగవని, వారి ప్రాణాలకు ముప్పులేదని చెప్పలేని పరిస్థితి ప్రపంచం అంతటా ఒకేలా వుంది. 
అమెరికా ఎంత శక్తి మంతమైన దేశమో వేరే చెప్పనక్కరలేదు. అయినా, 1963లో  అప్పటి ఆ దేశ   అధ్యక్షుడు కెన్నడీ భార్యతో కలిసి డాలస్‌ మీదుగా ఓపెన్‌ కారులో వెళ్తుండగా, దుండగుడు జరిపిన కాల్పులలో మరణించారు. అలాగే, అమెరికా మరో అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ 1865, ఏప్రిల్‌ 14న వాషింగ్టన్‌ డీసీలో ఓ  థియేటర్‌లో ప్రదర్శనను తిలకిస్తుండగా దుండగుడు, వెనుక నుంచి వచ్చి తలపై తుపాకీతో కాల్చాడు. గాయపడిన ఆయన మరుసటిరోజు ఉదయమే ప్రాణాలు విడిచారు.

అలాగే, 1981, మే 30 బంగ్లాదేశ్‌ అధ్యక్షుదు  ముజబూర్  రెహమాన్‌ ను చిట్టగాంగ్‌లోని ప్రభుత్వ నివాసంలో ఉండగా, సైనిక తిరుగుబాటుదారులు కాల్పులు జరిపి హతమార్చారు. అలాగే పాకిస్థాన్‌ తొలి ప్రధాని లియాఖత్‌ అలీ ఖాన్‌ 1951, అక్టోబరు 16న హత్యకు గురయ్యారు.రావల్పిండిలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ గార్డెన్‌లో బహిరంగ సభలో  ప్రసంగిస్తుండగా,  అఫ్గానిస్థాన్‌కు చెందిన సయీద్‌ అక్బర్‌ ఆయనపై కాల్పులు జరిపాడు.

దీంతో అలీ ఖాన్‌ మరణించారు. శ్రీలంక ప్రధాని బండారు నాయకే 1959, సెప్టెంబరు 25న కొలంబోలోని తన స్వగృహంలో ప్రజలతో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే బౌద్ధ పూజారి తాల్దువే సోమరామా థెరో.. బండారనాయకే ఛాతీ, పొత్తికడుపు, చేతిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ బండారనాయకే ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయారు.

లుముంబా నాడు కాంగో ప్రధాని. ఆ దేశం నుంచి వేరుపడిన రిపబ్లిక్‌ ఆఫ్‌ కటంగా అధికారులు లుముంబాను చిక్కించుకుని, బెల్జియం అధికారుల సమక్షంలో 1961, జనవరి 17న ఉరి తీశారు. ఈ ఘటన ఆ తర్వాత ఆఫ్రికా వ్యాప్త ఉద్యమానికి దారితీసింది.షే

క్‌ ముజిబుర్‌ రెహమాన్‌.. పాకిస్థాన్‌ అనుకూల బంగ్లాదేశ్‌ సైనిక సిబ్బంది... 1975, ఆగస్టు 15న తమ అధ్యక్షుడు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ నివాసంలోకి చొరబడి, ఆయనతో పాటు భార్య, అయిదుగురు పిల్లలను హతమార్చారు. ఇజ్రాయెల్‌ ప్రధానిగా.. పాలస్తీనాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రాబిన్‌ తీవ్రంగా కృషి చేశారు. ఓస్లో ఒప్పందానికి మద్దతుగా 1995, నవంబరు 4న టెల్‌ అవీవ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా... రాబిన్‌ను ఆల్ట్రానేషనలిస్ట్‌ యిగల్‌ అమీర్‌ కాల్చి చంపాడు.

పాకిస్థాన్‌ ప్రధానిగా 2007, డిసెంబరు 27న భుట్టో రావల్పిండిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆమెతో పాటు మరో 23 మంది మరణించారు. శ్రీలంక అధ్యక్షుడి హోదాలో 1993, మే 1న కొలంబోలో మేడే పరేడ్‌ను ప్రేమదాస పర్యవేక్షిస్తుండగా... ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రేమదాస, మరో 17 మంది దుర్మరణం పాలయ్యారు.లెబనాన్‌ ప్రధాని హోదాలో హరిరి 2005, ఫిబ్రవరి 14న బీరూట్‌లో మోటారు వాహన ర్యాలీ నిర్వహిస్తుండగా... హెజ్బుల్లా ఉగ్రవాదులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. హరిరి, మరో 21 మంది చనిపోయారు..ఇలా చరిత్రలో  హత్యకు గురైన దేశాది నేతలు, ప్రభుత్వాధి నేతలు  ఇంకా ఉండవచ్చును.

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.