కేసీఆర్ కు మునుగోడు భయం?

Publish Date:Aug 20, 2022

Advertisement

కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందా? మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి.. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? అనవసరపు ఎన్నిక పుట్టి ముంచుతుందా అన్న అనుమానం మొదలైందా? బీజేపీ వ్యూహాత్మకంగా తెచ్చి తలమీద పెట్టిన మునుగోడు ఉప ఎన్నిక తలభారంగా మారుతుందని ఆందోళన పడుతున్నారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే అంటున్నారు.

మునుగోడులో ప్రజాదీవెన పేరిట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం (ఆగస్టు 20) జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే మునుగోడు కాంగ్రెస్ కు మరో హుజూరాబాద్ అవుతుందా అన్న అనుమానం కేసీఆర్ లో కలిగిందని అనిపించక మానదని పరిశీలకులుఅంటున్నారు. కేసీఆర్ ప్రసంగంలో ధీమా లోపించిందనీ, ధైర్యం సడలిందనీ వారు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభమే మునుగోడు ఎవరికీ అవసరం లేని ఎన్నిక అని ప్రారంభించడమే కాకుండా.. ఎంత అవసరం లేని ఎన్నికైనా ఇక్కడ టీఆర్ఎస్ గెలవకుంటే.. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయంటూ జనాలను హెచ్చరించారు. తన ధైర్యం మీరే అంటూ జనానికి చెబుతూనే అటువంటి మీరే మద్దతు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.

సాధారణంగా సభ ఏదైనా, వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా కేసీఆర్ నెటి వెంట మాటల బాణాలు ప్రత్యర్థులపై నిప్పుల వాన కురిపిస్తాయి. అలాంటిది ఈ సారి కేసీఆర్ కేంద్రంపై, మోడీపై, అమిత్ షాలపై కురిపించిన విమర్శల వర్షంలో వాడి వేడి కన్నా... స్వీయ రక్షణ భావమే కనిపించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకు వచ్చినా తలొగ్గక మీటర్లు పెట్టేదేలే అని కోట్లాడాననీ, ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ గెలవకుంటే.. తనను పక్కకు నెట్టేసి మరీ వ్యవసాయ మోటార్లకు మోడీ మీటర్లు పెడతారనీ ప్రజలను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా మాట్లాడారు.  మునుగోడులో గెలవకుంటే సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మునుగోడు వాస్తవానికి టీఆర్ఎస్ స్థానం కాదు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో వచ్చిన ఎన్నిక ఆ స్థానం నిలుపుకోవడం కాంగ్రెస్ కు ముఖ్యం. కావాలని ఉప ఎన్నిక వచ్చేలా పావులు కదిపిన బీజేపీకి అక్కడ విజయం ముఖ్యం. మునుగోడులో గెలిచినా, ఓడినా టీఆర్ఎస్ కు వచ్చేది కానీ పోయేది కానీ ఏమీ లేదు.

అయినా కేసీఆర్ మునుగోడు ఫలితం జీవన్మరణ సమస్యగా భావిస్తుండటానికి కారణం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా భావిస్తుండటమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే మునుగోడు సభలో ఈ ఉప ఎన్నికను గోల్ మాల్ ఎన్నికగా అభివర్ణిస్తూనే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటేయకుంటే.. యావత్ తెలంగాణకు నష్టం అన్నారు. బీజేపీ మాటలకు మోసపోతే గోస తప్పదని హెచ్చరించారు. అడుగడుగునా తెలంగాణకు చేటు చేస్తున్న మోడీ, షాలపై విమర్శల వాగ్బాణాలు సంధించారు. కానీ అదే సమయంలో.. కమలం వైపు మొగ్గు చూపితే సంక్షేమం మాట మరచిపోవాల్సిందే అని హెచ్చరికలూ చేశారు. మునుగోడు ఓటు తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశిస్తుందని కేసీఆర్ అన్నారు.

ఇంకా  తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లైనా ఇంకా కృష్ణా జలాల్లో మన వాటా ఎందుకు తేల్చలేదో.. మునుగోడుకు రానున్న అమిత్ షాను నిలదీసి తెలుసుకోవాలన్నారు. దేశం యావత్తూ మెచ్చుకునేలా సంక్షేమ బాటలో టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతుంటే.. ఆ సంక్షేమాన్ని బంద్ పెట్టాలనుకుంటున్న బీజేపీకి మునుగోడులో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ హయాంలో దేశంలో ఏ వర్గానికీ మేలు జరగలేదన్న ఆయన   బ్యాంకులు, రైళ్లు, రోడ్లు ఇలా అన్నిటినీ అమ్మేస్తూ పోతోందని, ముందు ముందు  రైతులభూములను కూడా కేంద్రం అమ్మేస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు.   కార్పొరేట్‌ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోందని కేసీఆర్ అన్నారు.  క్రియాశీల, ప్రగతి శీల శక్తుల కలయికకు మునుగోడు నాంది పలికిందన్నారు. సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు పలికిందని ప్రకటించిన ఆయన ఈ బంధం దేశ వ్యాప్తంగా మోడీ దుష్టపాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు.

 మొత్తం మీద మునుగోడు సభలో కేసీఆర్ కేంద్రంపై విమర్శలతో చెలరేగారు. ఇటీవల తరచుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన పై చేస్తున్న అవినీతి ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈడీ లేదు బోడీ లేదు.. తప్పు చేసిన వారు భయపడతారు తాను కాదని అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వ పతనం తప్పదంటూ బీజేపీ విమర్శలకూ బదులిచ్చారు. అసెంబ్లీలో ముగ్గురు సభ్యులున్న వారు ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. అది అహంకారమా బలుపా అని ప్రశ్నించారు. ప్రజల కోసం ఆలోచించి, వారి కోసం నిజాయితీగా పని చేసేవారు మోడీకి భయపడరని కేసీఆర్ అన్నారు.  మాట్లాడితే చాలు తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటుంటారు, ప్రజా మద్దతుతో గెలిచిన ఆ ప్రభుత్వాలను కూల్చేస్తానని విర్రవీగే నిన్ను పడగొట్టే వాళ్లే లేరనుకుంటున్నారా మోడీ అని ప్రశ్నించారు. మోడీని ఎవరూ పడగొట్టక్కర్లేదు ఆయన అహంకారమే ఆయనను కూల్చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఇన్ని చెప్పిన కేసీఆర్ మళ్లీ మునుగోడు ఉప ఎన్నికకు వచ్చే సరికి ఓటర్లకు రెండే రెండు చాయిస్ లు ఇచ్చారు. మీటర్లు పెట్టే మోదీ కావాలా… మీటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలా.. తేల్చుకోవాలన్నారు. తాను తెలంగాణ కోసం తెగించిన నిలబడగలిగానంటే అందుకు ప్రజలిచ్చిన బలమే కారణమన్నారు. ఇప్పుడు ఆగం చేస్తే తెలంగాణ ఏమవుతుందని ప్రశ్నించారు.  మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలకు రావాలంటే… ఈ దుర్మార్గులకు తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.  ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసమో, పార్టీ కోసమో కాదన్న కేసీఆర్  తెలంగాణ ఏమంటుుందనేది మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా దేశం మొత్తానికీ చాటాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద బొమ్మలు ( ఫ్లెక్సీలు) చూసి మోసపోతే గోస పడతామని హెచ్చరించారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.