మునుగోడులో బీజేపీ ఓడిందా..? గెలిచిందా..?

Publish Date:Nov 7, 2022

Advertisement

‘నేను చస్తే.. గెలుస్తానా… మరి ఇది చస్తే.. నేను గెలుస్తానా..?’ నేచురల్ స్టార్ నాని నటించిన  ఎంసీఏలో నటి భూమిక పాత్రను ఉద్దేశించి విలన్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీకి అతికినట్టు సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడులో హోరాహోరీ పోరాడిన బీజేపీ 10 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ నైతికంగా తానే గెలిచానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే.. ఓట్ల సంఖ్యా పరంగా బీజేపీ ఓడిందే కానీ.. నైతికంగా గెలిచామనేది వారి అభిప్రాయం.

మునుగోడులో తాను ఓడినా.. వచ్చే ఎన్నికల నాటికి 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచే ఛాన్స్ లేదని, ఒక వేళ నిలిచినా ఉన్న కాస్త ప్రతిష్ఠ మంటగలవడం తప్ప మరో ఫలితం ఉండదన్న స్పష్టమైన సందేశాన్ని నియోజకవర్గం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓట్ల పరంగా గెలవకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ద్వారా బీజేపీ విజయం సాధించినట్లే అంటున్నారు. తనకు- టీఆర్ఎస్ కు మధ్య మాత్రమే ద్విముఖ పోరు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీసికట్టు మిడతంబొట్లు మాదిరిగా చేసిందంటున్నారు. అలా చూస్తే బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయడంలో సక్సెస్ ఫుల్ గా విజయం సాధించిందనే చెప్పాలంటున్నారు.

గతంలో 2014 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ 65 వేల 496 ఓట్లు తెచ్చుకుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై 38 వేల 55 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలిచింది. మళ్లీ 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాసప కాంగ్రెస్ పార్టీపై 22 వేల 552 ఓట్ల తేడాతో ఓటమి చవి చూసింది. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికి 74 వేల 687 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి లభించిన ఓట్లు కేవలం 12 వేలు మాత్రమే. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు. రాజగోపాల్ రెడ్డి పది వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.  రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికీ  రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.

హుజురాబాద్ షాక్ లో సీఎం కేసీఆర్ మునుగోడుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారని బీజేపీ అధినేతలు ముందే పసిగట్టారు. మునుగోడులో గెలిచేందుకు పార్టీ యంత్రాంగాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, మద్యం, మనీ ఇలా ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా కేసీఆర్ రంగంలోకి దిగుతారని కూడా బీజేపీ పెద్దలు ముందే   అంచనా వేశారు. 2018లో కేవలం 12 వేల ఓట్లు తెచ్చుకోడానికి ఆపసోపాలు పడిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో 38.4 శాతంతో 86 వేల 697 ఓట్లు రాబట్టుకోవడం అంటే మాటలు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా చూసుకున్నప్పుడు బీజేపీ ఈ సారి గ్రాండ్ సక్సెస్ అయినట్టే అని చెబుతున్నారు. సంఖ్యాపరంగా ఓడినా మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి బీజేపీ పకడ్బందీ వ్యూహంతోనే దిగిందని చెబుతున్నారు.

ప్రణాళికలు ముందుగానే రచించుకుని, ఆ  ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది. రెండు హేమాహేమీ పార్టీలైన టీఆర్ఎస్- బీజేపీ తలపడిన ఈ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేసింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభావాన్ని తప్పించడంలో కృతకృత్యం అయిందంటున్నారు. ఇక టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనేది జనంలోకి చొప్పించేలా చేయగలిగిందని చెబుతున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షరా మామూలుగానే రచ్చ కొనసాగింది. తొలుత అభ్యర్థి విషయంలో పార్టీలో వివాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక మారరు. రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకారం అందించలేదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా లాభం లేదనే అభిప్రాయం జనంలోకి బాగా వెళ్లిపోయింది.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య రచ్చే  పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసిందంటున్నారు.  ఇలా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయేలా చేయడంలో బీజేపీ అగ్రనేతల పాచిక పారిందంటున్నారు. తద్వారా కూడా బీజేపీ విజయం సాధించినట్లే అనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని చూపించడంలో ఆ పార్టీ నేతలు గెలిచారనే చెప్పాలని చెబుతున్నారు. టీఆర్ఎస్- బీజేపీ- కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటే గులాబీ పార్టీకి కలిసి రావచ్చని.. అందుకే అక్కడ ద్విముఖ పోటీకి రంగం సిద్ధం చేయాలనే వ్యూహాన్ని అమలు చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందంటున్నారు. టీఆర్ఎస్ తో ముఖాముఖి తలపడితే తిమ్మిని బమ్మిని చేసి అయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చనేది బీజేపీ వ్యూహం అంటున్నారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందనే సంకేతం పంపడంలో కమలనాథులు విజయం సాధించినట్లే అని చెబుతున్నారు.

ఇప్పుడు ఓడిపోతే పోయింది కానీ.. అధికార టీఆర్ఎస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గడగడలాడించిందనే చెప్పాలంటున్నారు. ఉప ఎన్నికను సవాల్ గా తీసున్న కేసీఆర్ 14 మంది మంత్రుల్ని, సుమారు వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపారు. తనతో సహా బీజేపీతో ఒక యుద్ధమే చేశారని చెప్పొచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీని చూసి  ఎంతలా వణికిపోతోందో చెప్పకుండానే చెప్పిందంటున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ ఓడినప్పటికీ.. వ్యూహాత్మకంగా గెలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం స్వయంగాను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా మొత్తం పార్టీని ఇంతలా మోహరించినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీ పరిమితం చేయడంలో బీజేపీ గెలిచిందంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సీపీఐ, సీపీఎం ఓట్ల వల్లే టీఆర్ఎస్ కు ఆ మాత్రం మెజారిటీ వచ్చిందంటున్నారు. లేదంటే టీఆర్ఎస్ పరిస్థితి ఇరకాటంలో పడేదనే అభిప్రాయాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెబుతున్నారు.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.