భారీ బడ్జెట్ సరే మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు సంగతేంటి?!
Publish Date:Mar 17, 2023
Advertisement
భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామంటూ మురిసి పోతున్న ఏపీ సీఎం జగన్ మునిసిపల్ ఉద్యోగాల వేతనాల పెంపు గురించి ఎందుకు పట్టించుకోరని కార్మికులు నిలదీస్తున్నారు. విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కర్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ నేతలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ పై ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమ పథకాలు తొలగించారని విమర్శించారు. భారీ అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టి మునిసిపల్ కార్మికుల వేతనాల పెంపునకు సొమ్ము లేదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమానపనికి సమాన వేతనం అంటూ కోర్టు తీర్పులు ఇచ్చినా కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ నామమాత్రపు వేతనాలిస్తున్నారని ఆరోపించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్మికుల రెగ్యులరైజేషన్ పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/municipal-workers-dharna-in-vijayawada-25-152651.html





