మాలేగావ్ పేలుళ్ల కేసు.. నిందితులందరూ నిర్దోషులే!
Publish Date:Jul 31, 2025
Advertisement
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులు అందరూ నిర్దోషులేనంటూ ముంబై ప్రత్యేక కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురిపై అభియోగాలున్న సంగతి తెలిసిందే. 2008 నాటి ఈ కేసులో సుదీర్ఘ విచారణ తరువాత నిందితులను అభియోగాలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత ఈ కేసులో నిందితులందరినీ ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ సందర్భంగా కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలలోని లోపాలను ఎత్తి చూపింది. మాలెగావ్ బాంబుపేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది, మాలెగావ్ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా లేల్చుతూ వారిని విడుదల చేసింది. నిందితుల ప్రమేయాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందన్న NIA కోర్టు, సంశయలాభంతో మాలెగావ్ బాంబుపేలుళ్ల కేసు నిందితుల విడుదల చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం అనుమానంతో వారిని దోషులుగా నిర్ధారించలేమని న్యాయస్థానం తెలిపింది. 2008 సెప్టెంబరు 29న మాలెగావ్ భికుచౌక్ ప్రాంతంలో టూవీలర్‌లో అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఆరుగురి వ్యక్తులు మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో బీజేపీకి చెందిన ప్రజ్ణా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులు పేర్కొన్నారు. అలాగే రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ సహా మరో ఐదుగురు వ్యక్తులను ఈ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.ఈ కేసులో మొత్తం 220మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేసినా.. 2011లో దర్యాప్తునుఎన్ఐఏ చేపట్టింది.
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న జరిగిన భారీ పేలుడులో ఆరుగురు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది. ఈ తరువాత దీనిని ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.
http://www.teluguone.com/news/content/mumbay-special-court-verdict-on-malegaon-blasts-case-25-203167.html





