సొంతగూటికి ముకుల్ రాయ్.. బీజేపీకి మమత షాక్ 

Publish Date:Jun 5, 2021

Advertisement

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసల చక్రం పూర్తిగా 360 డిగ్రీలు పూర్తి చేసుకుని రివర్స్ జర్నీ స్టార్ట్ చేసిందా? ఇప్పుడు ఇక  ఇటు నుంచి అటు వలసలు, ఘర్ వాపసీ మొదలవుతోందా? అంటే, కోల్ కతా పొలిటికల్ సర్కిల్స్ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. 2017లో పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్’ కాషాయం కట్టడంతో తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఆయనే, వలసలకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కూడా కొందరు తృణమూల్ నాయకులు కాషాయం కట్టినా, ముకుల్ రాయ్’ తోనే వలసలు  ఊపందుకున్నాయి.  ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే, ఘర్ వాపసీ, సొంతింటికి తిరిగిచేరే కార్యక్రమం మొదలయ్యే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. 

ఇటీవల కాలంలో ఆయన బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నారని, అటు మీడియా వర్గాల్లో,ఇటు పొలిటికల్ సర్కిల్స్’లో చర్చ జరుగుతోంది. ముదొంచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, మొన్నటి ఆసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన సువేందు అధికారికి బీజేపీ  ఢిల్లీ పెద్దలు పెద్ద పీట వేయడం, ఆయనను, బీజేపీ ఎల్పీ నేతగా,  ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికోవడం ముకుల్ రాయ్’ జీర్ణించుకోలేక పోతున్నారు.  అందుకే ఆయన మళ్ళీ మమత వైపు చూస్తున్నారని  అయన సన్నిహిత వర్గాల సమాచారంగా కోల్‌కతా మీడియా కోడై కూస్తోంది. 

ఇటీవల  ముకుల్ రాయ్’ సతీమణి అనారోగ్యంతో కోల్’కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి ముకుల్ రాయ్ సతీమణిని పరామర్శించడంతో పాటుగా, ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. నిజంగా ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో కానీ, ఆ మర్నాడు ఉదయమే  ప్రధాని నరేంద్ర మోడీ ముకుల్ రాయ్’కి ఫోన్ చేసి, అయన భార్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా, అభిషేక్ బెనర్జీ, ముకుల్ రాయ్’ని కలవడం ఆ వెంటనే ప్రధాని ఫోన్ చేయడంతో  ఉహాగానాలు మొదలయ్యాయి. నిజానికి, ఈ పరామర్శల కలయికలు యాదృచ్చికంగా జరిగాయా, లేక కోల్’కతా కబురు ఢిల్లీకి చేరి ప్రధాని నేరుగా లైన్’లోకి వచ్చారా అన్నది, ఎవరికీ తెలియక పోయినా, అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ, ఘన విజయం సాధించి మూడవసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ, దిపేందు బిస్వాస్, సరళ మురు, అమల్ ఆచార్య సహా మరికొందరు సొంతగూటికి చేరేందుకు సిద్దమైన నేపధ్యంలో ముకుల్ రాయ్ ఎపిసోడ్’ ప్రాధాన్యతను సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

అంతే కాకుండా ముకుల్  రాయ్’ కుమారుడు, ఆయనతో పాటుగా బీజేపీలో చేరిన శుభరాంషు, కొద్ది రోజుల క్రితం, బీజేపీకి పేస్బుక్’లో చురక అంటించారు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే, ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిదని’ ఆయన పార్టీ అధికార ఎఫ్బీలో పేర్కొన్నారు. 


మరో వంక మమతా బెనర్జీ కూడా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు  ముకుల్ రాయ్’ మూల కారణమని భావిస్తున్నారు. ముకుల్ రాయ్’ చేరికతోనే బీజేపీకి ఉపోచ్చిందని, ఆయన్ని వదులుకోవడం పార్టీ చేసిన తప్పని, ఆమె కొంచెం ఆలస్యంగానే అయిన గుర్తించారు.లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 స్థానాలు గెలుచుకుని,  అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. ప్రతిపక్షంగా నిలిచింది. అందుకే మమత మళ్ళీ ముకుల్ రాయ్’ని వెనక్కి తెచ్చుకుంటే, బీజేపీ దూకుడుకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని రాయబేరానికి పంపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా, బెంగాల్లో రివర్స్ ఆకర్ష్’ మొదలైంది... ముకుల్ రాయ్ ఓకే చేస్తే బీజేపీ వాపు తగ్గి అసలు బలం బయట పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.