కవలలకు తాత అయిన ముఖేష్ అంబానీ
Publish Date:Nov 20, 2022
Advertisement
వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కవల పిల్లలకు తాతయ్యారు. ఆయన కుమార్తె ఈశా అంబానీ శనివారం (నవంబర్ 19) కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ఈశా అంబానీ – ఆనంద్ పిరమాల్ దంపతులకు కవలలు జన్మనిచ్చినట్టు పేర్కొంది. కవలలలో పాపకు అదియా, బాబుకి కృష్ణ అని పేర్లు పెట్టినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఆ దంపతులకు, పిల్లలకు మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నామని అంబానీ కుటుంబం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ఈశా-ఆనంద్ లు చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పంచి 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈశా రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను చూసుకుంటున్న సంగతి విదితమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mukesh-ambani-grnd-father-to-twins-25-147385.html
http://www.teluguone.com/news/content/mukesh-ambani-grnd-father-to-twins-25-147385.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026





