ముద్రగడ మళ్లీ మొదలెట్టారు!.. కాపులకు అన్యాయం అంటూ చంద్రబాబుకు లేఖ

Publish Date:Feb 2, 2026

Advertisement

ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డిపై నెటిజనులు ఉత్తర కుమారుడు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన చంద్రబాబుపై లేఖాస్త్రాలు సంధించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇటీవలి కాలంలో అంటే గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలై.. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆయన దాదాపుగా సైలంట్ అయిపోయారు. అంతకు ముందు అంటే ఎన్నికలకు ముందే..  పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభం తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

అది పక్కన పెడితే... అంతకు ముందు అంటే  2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్నినడిపారు.  ఆ ఉద్యమం పూర్తిగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పటి విపక్ష నేత జగన్ కు అనుకూలం అని అప్పట్లో  రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.   2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఆపేశారు.  అంతే కాకుండా జగన్ సర్కార్ కు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు కారణంగా  ఆయన కాపు సామాజికవర్గానికి దూరం అయ్యారు. సరే ఆ ఎన్నికలలో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఘన విజయం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనంతో వైసీపీ  ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయింది. ఆ తరువాత నుంచీ దాదాపుగా సైలంట్ అయిపోయిన ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు తాజాగా తన పెన్ను విదిల్చారు.  

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడులు జరిగడంతో ఇప్పుడు మళ్లీ ఆయన కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం వ్యతిరేకం అంటూ గొంతు సవరించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కు బహిరంగ లేఖ రాశారు.  రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరుగుతోందంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రబాబు పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

 కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో పంపించేయడానికి కంకణం కట్టుకున్నారా? అంటే ఆ లేఖలో చంద్రబాబు, లోకేష్ లను ప్రశ్నించారు. అయితే ఈ లేఖపై నెటిజనులు ముద్రగడను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కు కాపుసామాజిక వర్గం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుఓడిస్తానని శపథం చేసినప్పుడు, వైసీపీ అధినేత సహా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. అయినా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న ముద్రగడకు కాపు సామాజిక వర్గం ప్రతినిథిగా చెప్పుకునే నైతికత ఎక్కడిదని విమర్శిస్తున్నారు. 

By
en-us Political News

  
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.