అద్దె కట్టలేదని ఎమ్మార్వో కార్యాలయానికి తాళం
Publish Date:Jun 20, 2022
Advertisement
ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు చదువుకోవడానికి వీలుగా, కాలేజీలకు దగ్గరి ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో వుండడం పరిపాటి. కుంటుంబాలు కూడా తమ పిల్లలకు రవాణా ఇబ్బందులు లేకుండా వుండేం దుకు సాధ్యమయినంతవరకూ కాలేజీలకు, స్కూళ్లకు దగ్గరి ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లలో వుంటున్నారు. ఇది ప్రతీ పట్టణంలోనూ సాధారణంగా కనిపించే సీన్. చదువు అయి వెళ్లేటపుడో, పోనీ వేరే ప్రాంతానికి వెళ్లవలసినపుడో ఆ ఇంటి యజమానికి చెల్లించవలసిన అద్దె, కరెంటు బిల్లు ఏమన్నా వుంటే పూర్తిగా చెల్లించి మరీ వెళతారు. ఆంధ్రా తెలంగాణా విడిపోయిన తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె ఇళ్లలో వున్నాయి. స్వంత భవనాలు ఇంకా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఇంకా కొన సాగుతోంది. అలా వున్నదే నంద్యాల జిల్లా పాములపాడులోని ఎమ్మార్వో కార్యాలయం. దీన్ని గురించి ప్రత్యేక ప్రస్థా వన దేనికంటే .. ఈ కార్యాలయానికి కొత్త భవనం ఏర్పాటయింది. కానీ కార్యాలయం వస్తువులు, ఫైళ్లు ఫర్నీచర్ మాత్రం అక్కడికి మార్చే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఇప్పటి వరకూ అద్దెకున్న భవ నానికి ప్రభుత్వం అద్దె కట్టలేదట! మరి అద్దె కట్టకుంటే యజమాని కాగితం కదలనిస్తాడా? మరి ప్రభు త్వం ఈ సాధారణ నియమాన్ని నిర్లక్ష్యం చేయడమేమిటి? పాములపాడులో ఎమ్మార్వో కార్యాలయం వున్న భవనానికి ఇంతవరకూ అద్దే చెల్లించలేదట. ప్రభుత్వం ఏర్పాటయిన సుమారు నాలుగేళ్ల నుంచి ఆ భవనానికి అద్దెగా ఒక్క పైసా ఇవ్వలేదని భవనం యజమాని ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఆయనకు రూ.3,65,868 రూపాయలు చెల్లించాలి. ఆ మొత్తం చెల్లిస్తేనే ఇక్కడ నుంచి వస్తువులు బయటికి వెళతాయని తెగేసి చెప్పేడు. అంతేకాదు భవనానికి ఏకంగా తాళం వేసేసేడు. ఈ రహస్యమేమీ తెలియని ప్రజలు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అక్కడ తాళం వేసి వుండడం చూసి ఖంగారు పడ్డారు. జగన్ పాలనలో ఇలాంటి కామెడీలు కూడా జరుగుతున్నాయన్నది వారికి తెలియడానికి చాలా సమయమే పట్టింది!
http://www.teluguone.com/news/content/mro-office-locked-for-not-paying-rent-25-138031.html





