Publish Date:Jan 16, 2026
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండగా, ఇద్దరు జనసేన, ముగ్గురు బీజేపీ, నలుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పెమ్మసాని, రామ్మోహన్ రూపంలో కేంద్రంలో మంత్రి పదవులుండగా.. బీజేపీ నుంచి శ్రీనివాసవర్మ కూడా కేబినేట్ లో సహాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి అవకాశం లభించింది తొలి మంత్రి వర్గంలోనే వీరు స్థానం సంపాదించారు.
అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మరీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లభించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీలో ఈ విషయం ఆయన చెవిలో వేసి వచ్చారు. దీంతో ప్రతిపాదనలు పంపమని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీంతో చంద్రబాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కుల సమీకరణల్లో భాగంగా ఈ సారికి ఒక రెడ్డి సామాజికవర్గం పేరు ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది.
గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతే కాకుండా ప్రకాశం జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలోనూ వేమిరెడ్డి ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం కట్టబెడితే ఆయన ద్వారా రెండు జిల్లాలను కవర్ చేసినట్టుగా ఉంటుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన పేరు కేంద్ర మంత్రిగా సిఫార్సు చేసినట్టు కనిపిస్తోంది.
ఇక జనసేనకుగానీ ఒక మంత్రి పదవే ఇస్తే.. బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర పదవులు ఇస్తారన్న మాట కూడా జోరుగాననే ప్రచారం సాగుతోంది. ఒక దశలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు వినిపించినప్పటికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కారణం వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా జిల్లాలో ప్రభావవంతమైన నాయకత్వం వహించడం.. వంటి అంశాలను పరిగణలోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-vemireddy-prabhakar-reddy-39-212596.html
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.