వేమిరెడ్డికి....కేంద్ర బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనా!?
Publish Date:Jan 16, 2026
Advertisement
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండగా, ఇద్దరు జనసేన, ముగ్గురు బీజేపీ, నలుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పెమ్మసాని, రామ్మోహన్ రూపంలో కేంద్రంలో మంత్రి పదవులుండగా.. బీజేపీ నుంచి శ్రీనివాసవర్మ కూడా కేబినేట్ లో సహాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి అవకాశం లభించింది తొలి మంత్రి వర్గంలోనే వీరు స్థానం సంపాదించారు. అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మరీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లభించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీలో ఈ విషయం ఆయన చెవిలో వేసి వచ్చారు. దీంతో ప్రతిపాదనలు పంపమని కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీంతో చంద్రబాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కుల సమీకరణల్లో భాగంగా ఈ సారికి ఒక రెడ్డి సామాజికవర్గం పేరు ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది. గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతే కాకుండా ప్రకాశం జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలోనూ వేమిరెడ్డి ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం కట్టబెడితే ఆయన ద్వారా రెండు జిల్లాలను కవర్ చేసినట్టుగా ఉంటుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆయన పేరు కేంద్ర మంత్రిగా సిఫార్సు చేసినట్టు కనిపిస్తోంది. ఇక జనసేనకుగానీ ఒక మంత్రి పదవే ఇస్తే.. బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర పదవులు ఇస్తారన్న మాట కూడా జోరుగాననే ప్రచారం సాగుతోంది. ఒక దశలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు వినిపించినప్పటికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కారణం వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా జిల్లాలో ప్రభావవంతమైన నాయకత్వం వహించడం.. వంటి అంశాలను పరిగణలోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/mp-vemireddy-prabhakar-reddy-39-212596.html





