ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

Publish Date:Apr 16, 2026

Advertisement

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్  హరీశ్ రావు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హరీశ్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన పోరాట ఫలితమని గుర్తు చేశారు. వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సాధారణ ప్రజలు చేసిన త్యాగాల పునాది మీదే ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి గొప్ప ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే కాకుండా అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపడమేనని ఆయన మండిపడ్డారు.

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, దీనిని జీర్ణించుకోలేకపోవడమే బీజేపీ నేతల వ్యాఖ్యల్లో ప్రతిఫలిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తమ అధికారిక వైఖరిని స్పష్టం చేయాలని, లేకపోతే ఇది పార్టీ ధోరణిగానే ప్రజలు భావిస్తారని హెచ్చరించారు.

By
en-us Political News

  
అలా సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో అమరావతి అభివృద్ధికి సింగపూర్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందన్న పరిశీలన, అధ్యయనానికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్‌లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలం తర్వాత అమెరికా చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపడం విశేషం.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జూనియర్ ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్ వారిని బెదిరించి, నిందితులైన సీనియర్ అధికారులకు సహకరించారని ఆరోపణలున్నాయి.
పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.
విశాఖపట్నం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, స్నేహితులు తనపై దాడి చేశారన్న అవమానభారంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.