కాళ్లు వాచాయి.. రంగు మారాయి.. కానీ, గాయాలు లేవు.. రఘురామ మెడికల్ రిపోర్ట్

Publish Date:May 16, 2021

Advertisement

ఎంపీ రఘురామ రాజు రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారింది కానీ, బయటికి గాయాలు కనిపించడం లేదని డాక్టర్లు తమ మెడికల్ రిపోర్టులో తెలిపారు. ఎంపీ రఘురామ రాజుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది. రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని, రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారిందని, కానీ బయటికి గాయాలు కనిపించడం లేదని అందులో ఉంది. అవి కొట్టిన దెబ్బ‌ల‌ని చెప్ప‌లేమ‌ని వైద్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.  

రఘురామకు గుండె నొప్పి ఉందని ఫిర్యాదు చేశారని, నాలుగున్నర నెలల క్రితం గుండెకు శస్త్రచికిత్స జరిగిందని, వెంటనే కార్డియాలజిస్ట్‌కు పంపామని రిపోర్టులో రాశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులో తెలిపారు. నెఫ్రాలజిస్ట్ దగ్గరకు కూడా పంపామని, నార్మల్‌గానే ఉందని వైద్యులు నివేదిక‌లో పొందుప‌రిచారు. 

ఎంపీ రఘురామ కృష్ణంరాజు  శరీరంపై ఎటువంటి గాయాలు లేవని హైకోర్టు కు సమర్పించిన నివేదికలో  వైద్య నిపుణులు కమిటీ స్పష్టం చేసింది. రఘు రామ కృష్ణం రాజు ని రమేష్ ఆసుపత్రికి తరలించాలనే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ ఆసుపత్రిలో పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ర‌ఘురామ‌ను ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళితే.. టీడీపీ పార్టీ ఆఫీసుకు పంపిన‌ట్టేన‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ వాద‌న‌ను హైకోర్టు విభేదించింది. 

హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 12లోగా మెడిక‌ల్ రిపోర్ట్ ఎందుకు కోర్టుకు నివేదించ‌లేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ఎంపీ ర‌ఘు రామకృష్ణ రాజును త‌క్ష‌ణ‌మే ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు పంపించాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎంపీ ర‌ఘురామ కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది. జీజీహెచ్‌తో పాటు ర‌మేశ్ ఆసుప‌త్రిలోనూ ప‌రీక్ష‌లు చేయాల‌న్న కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదించారు. 

క‌స్ట‌డీలో ఉండ‌గా సీఐడీ అధికారి పిటిష‌న‌ర్‌ను క‌లిశార‌ని, ఇలా క‌ల‌వ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టు సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారు? రఘురామను ఎందుకు జైలుకు తరలించారు? అని ప్ర‌శ్నించారు.  

గుంటూరు ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలను యధాతధంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు, cid కోర్టు ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అదనపు అడ్వకేట్ జనరల్  వాదించడాన్ని తప్పుపట్టారు.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు త‌ర‌ఫు న్యాయవాది ఆదినారాయణ.. తన క్లయింట్ ప్రాణాలకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు పంపించాలని కోర్టును కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే తనను షూట్ చేయవచ్చునని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. ఇప్ప‌టికే రిమాండ్ విధిస్తూ జ‌డ్జి ఉత్త‌ర్వులు జారీ చేశార‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాదించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఎంపీని వెంట‌నే జైలు నుంచి ర‌మేశ్ ఆసుప‌త్రికి పంపాల‌ని ఆదేశించారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.