Publish Date:May 30, 2025
మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు, ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈటెల బీజేపీలో ఉన్నారా? బీఆర్ఎస్లో ఉన్నారా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారని ఆయన అన్నారు.
దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే బండి సంజయ్‌ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలిగించారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భయపడే భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపేశారాని మహేష్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణాన్ని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధనం చెప్పాలని ఆయన తెలిపారు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని పీసీసీ చీఫ్ వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-etela-rajender-39-199002.html
Publish Date:Jun 10, 2025
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులె ఆయన దాఖలు చేసుకున్ని పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు
జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు.
రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు.
ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్‌కు ఆయన వివరించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
వరుస దెబ్బలు తగులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వచ్చినట్టు కనిపించడం లేదా? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల పట్ల ఉండాల్సిన నిబద్ధత మరచి మరీ జగన్ అనుంగు మీడియా వ్యవహరించడం చేటు తెస్తుందా? అంటే అదే నిజమని తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో స్పందించారు.
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది.