ప్రియుడి మోజు.. కూతురు కేసు.. ఈ తల్లి మహా ముదురు...

Publish Date:Jun 4, 2021

Advertisement

ప్రియుడి మోజులో మునిగి ఇటు ఆడవాళ్లు, ప్రియురాలి ముసుగులో పడి మగవాళ్లు, ఈ మధ్య కాలంలో చాలా దారుణాలు చేస్తున్న విషం తెలిసిందే.. ఆ వార్తలు లేకుండా న్యూస్ ఉండదు న్యూస్ పేపర్ ఉండదు. ఇక వెలుగులోకి రాని సంఘటనలు అయితే చెప్పనక్కర్లేదు. ఆమెకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేసింది. ఆ ప్రాసెస్ లో రెండురోజుల నుంచి కూతురు కనిపించడం లేదు. ఆ విషయమై కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు., స్థానికులు నిలదీశారు. ఆ తర్వాత ఆ  దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం వార్త చదవండి.. 

 ఓపెన్ చేస్తే.. అది విశాఖ నగరం. బొద్దాన రమేష్, వరలక్ష్మి భార్యాభర్తలు. ఐదేళ్ల కిందట పెళ్లి అయింది. ఆ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది ఆ అమ్మాయి పేరు సింధు. రమేష్ తాపీమేస్త్రీగా చేసుకుంటే కుటుంబాని పోషిస్తున్నాడు. తన భార్య వరలక్ష్మి కోస్టల్ ఫుడ్స్ కంపెనీలో పనిచేసేది. వాళ్ళ జీవితం ఏ ఆటంకాలు లేకుండా సాగుతున్న సమయంలో.. ఆమె ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అంటని పేరే బోర జగదీష్ రెడ్డి. పరిచయం ముందు దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ పరిచయంతో దగ్గరైనట్లు వరలక్ష్మి , జగదీశ్ రెడ్డి దగ్గరయ్యారు. వరలక్ష్మి భర్తకు తెలియకుండా  జగదీశ్ రెడ్డి తో మసక మసక చీకటిలో మల్లెతోనా వెనకాల అంటూ  ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. జగదీష్‌కి అప్పటికే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక అక్కడైతే ఆగక  కోవెక్కిన వరలక్ష్మి గత మార్చి 14న ప్రియుడు జగదీష్‌తో వెళ్లిపోయింది. కొద్దిరోజులకి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 14న మళ్లీ వచ్చిన జగదీష్.. ప్రియురాలిని, ఆమె కూతురు సింధుని తీసుకుని వెళ్లాడు. రెండు రోజుల కిందట భర్త రమేష్‌కి ఫోన్ చేసింది. 

కట్ చేస్తే.. తమ కూతురు చనిపోయిందని వరలక్ష్మి చెప్పింది. భార్య మాటలపై భర్తకు  అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాప ఏమైందని ప్రశ్నించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల కిందట పాపను అతి కిరాతకంగా హత్య చేసి.. అర్ధరాత్రి వేళ శ్మశానంలో పూడ్చిపెట్టినట్లు తేలింది. పాప మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. చిన్నారి మెడ, శరీరంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ప్రియుడి మోజులో కన్నకూతురిని కిరాతకంగా చంపేసిందని తెలియడంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితులు వరలక్ష్మి, ఆమె ప్రియుడు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.