ఆ అమ్మ ప్రేమకు ఫిదా కాని వారుంటారా?
Publish Date:Jul 17, 2022
Advertisement
అమ్మ ప్రేమకు హద్దులుండవు. అమృతం కూడా అమ్మ ప్రేమ ముందు దిగదుడుపే.. అందుకే అంటారు అమ్మ అని. తన బిడ్డ భద్రత కోసం, క్షేమం కోసం అమ్మ ఎంతకైనా తెగిస్తుంది. బిడ్డ కోసం ఆ అమ్మ పడిన తపన కళ్లు చెమర్చేలా చేస్తుంది. అయితే ఆ అమ్మ మనిషి కాదు.. ఓ ఏనుగు. తన పిల్లను రక్షించుకోవడం కోసం ఆ అమ్మ ఏనుగు పడిన తపన, తాపత్రేయం, బాధ, వేదన మనసును కదిలించేస్తుంది. ఈ సంఘటన థాయ్ ల్యాండ్ లోని నకోన్ నాయక్ప ప్రాంతంలో జరిగింది. గున్న ఏనుగు ప్రమాద వశాత్తూ గుంతలో పడిపోయింది. ఆ గున్న ఏనుగు తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పడిన తపన, తాపత్రేయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ అమ్మ ప్రేమకు ఫిదా అవుతున్నారు. పిల్లను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. గుంత చుట్టూ తిరుగుతూ బిడ్డను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనై మూర్ఛిల్లింది. సమాచారం అందుకున్న స్థానిక జూ అధికారులు అక్కడకు వచ్చి తల్లి ఏనుగుకు మత్తు మందు ఇచ్చారు. ఆ తరువాత గున్న ఏనుగును గుంత లోనుంచి బయటకు తీసి రక్షించారు. స్ఫృహలోకి వచ్చిన తరువాత తల్లి ఏనుగు పిల్లతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది.
http://www.teluguone.com/news/content/mother-elephants-love-has-no-boundaries-39-139925.html





