Publish Date:Jul 17, 2022
అమ్మ ప్రేమకు హద్దులుండవు. అమృతం కూడా అమ్మ ప్రేమ ముందు దిగదుడుపే.. అందుకే అంటారు అమ్మ అని. తన బిడ్డ భద్రత కోసం, క్షేమం కోసం అమ్మ ఎంతకైనా తెగిస్తుంది. బిడ్డ కోసం ఆ అమ్మ పడిన తపన కళ్లు చెమర్చేలా చేస్తుంది. అయితే ఆ అమ్మ మనిషి కాదు.. ఓ ఏనుగు. తన పిల్లను రక్షించుకోవడం కోసం ఆ అమ్మ ఏనుగు పడిన తపన, తాపత్రేయం, బాధ, వేదన మనసును కదిలించేస్తుంది. ఈ సంఘటన థాయ్ ల్యాండ్ లోని నకోన్ నాయక్ప ప్రాంతంలో జరిగింది. గున్న ఏనుగు ప్రమాద వశాత్తూ గుంతలో పడిపోయింది. ఆ గున్న ఏనుగు తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పడిన తపన, తాపత్రేయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ అమ్మ ప్రేమకు
ఫిదా అవుతున్నారు. పిల్లను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. గుంత చుట్టూ తిరుగుతూ బిడ్డను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనై మూర్ఛిల్లింది. సమాచారం అందుకున్న స్థానిక జూ అధికారులు అక్కడకు వచ్చి తల్లి ఏనుగుకు మత్తు మందు ఇచ్చారు. ఆ తరువాత గున్న ఏనుగును గుంత లోనుంచి బయటకు తీసి రక్షించారు. స్ఫృహలోకి వచ్చిన తరువాత తల్లి ఏనుగు పిల్లతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mother-elephants-love-has-no-boundaries-25-139926.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.