పెళ్లి రద్దుతో మనస్తాపం.. తల్లీ కుమార్తె బలవన్మరణం

Publish Date:Mar 14, 2026

Advertisement

వివాహ నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురై పెళ్లికూతురు, ఆమె తల్లి విషం తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో జరిగింది.  వివరాలిలా ఉన్నాయి.  ద్రోణాదుల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె దివ్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కుమార్తెకు పెళ్లి సంబంధం చూసిన పెద్దలు మార్టూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం నిశ్చయించారు. గత ఏడాది డిసెంబర్ 14న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో వివాహం జరపాలని నిర్ణయించారు.

అయితే ఇటీవల వరుడు శేషుబాబు దివ్యతో పాటు ఆమె తల్లిదండ్రులను  మార్టూరులోని తన ఇంటికి పిలిచి.. తాను హైదరాబాద్‌లో దివ్యను గమనిస్తూ రహస్యంగా తీసినట్లు చెప్పిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపిస్తూ పెళ్లి చేసుకోలేనని  తెలిపాడు.  దీంతో తీవ్రంగా కలత చెందిన దివ్య, ఆమె తల్లి సుజాత మార్టూరులోనే ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేసి తమ గ్రామానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మరుసటి రోజు సాయంత్రం ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన శ్రీనివాసరావు వారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి  గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాదాపు వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆ ఇద్దరి పరిస్థితి విషమించడంతో గురువారం (మార్చి 12) దివ్య, ఆమె తల్లి సుజాత మరణించారు.  ఒకేసారి తల్లి–కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

By
en-us Political News

  
బండి భగీరథ్‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
బినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 47.60 కిలోమీటర్ల పొడవున ఆరు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మచిలీపట్నం , రేపల్లె మధ్య రైల్వేలైన్‌లో మొత్తం 70 బ్రిడ్జిలు, 24 అండర్‌ బ్రిడ్జిలు రానున్నాయి.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
హుస్సేన్ సాగర్ వైపు వెడుతుండగా, దారిలో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులకు చెప్పుకుంటే తన కష్టం తీరుతుందేమోనన్న ఆశకలిగింది.
ఈ కేసులో కేటీఆర్ ఎసీబీ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. చార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఆ చార్జిషీట్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది.
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్‌ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.