ఏపీలో అత్యంత కాలుష్య నగరం విశాఖపట్నం
Publish Date:Nov 8, 2022
Advertisement
ఏపీలో అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం నిలిచింది. గాలి నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కాలుష్య నియంత్రణ బోర్డు దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 163 నగరాలకు సంబంధించిన వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఏపీలో అత్యంత కాలుష్య నగరంగా ఆ జాబితాలో చోటు చేసుకుంది. ఇంకా రాష్ట్రంలో రాజమహేద్రవరం, ఏలూరు, తిరుపతి, అనంతపురం నగరాలలో కూడా గాలి నాణ్యత తగినంత స్థాయిలో లేదని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇక దేశంలో అత్యంత కాలుష్య నగరం రాజధాని ఢిల్లీ మహానగరం అనుకుంటాం, కానీ ఈ సారి ఆ స్థానాన్ని బీహార్ లోని కటిహార్ నగరానికి దక్కింది. 2.40 లక్షల జనాభా గల ఈ నగరంలో గాలి నాణ్యత 360 పాయింట్లకు పడిపోయినట్లు సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. ఆ తరువాతి స్థానాలలో వరుసగా ఢిల్లీ (354 పాయింట్లు), నోయిడా (328), గాజియాబాద్ (304) నగరాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో కాలుష్య నగరంగా హైదరాబాద్ తన గుర్తింపును నిలబెట్టుకుంది.
http://www.teluguone.com/news/content/most-polluted-city-in-ap-is-viskha-25-146833.html





