Publish Date:Jun 16, 2026
అంతర్జాతీయ దౌత్య వేదికలపై దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, ఒప్పందాలు జరగడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అక్కడ చోటుచేసుకునే సరదా సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక సరదా సన్నివేశం ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సులో ఆవిష్కృతమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంభాషణ మళ్లీ మెలోడీ ట్రెండ్ ను తెరపైకి తెచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో మనమే ఫేమస్ అంటూ ఇటలీ పీఎం మెలోనీ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. జీ 7 సదస్సులో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలంతా సంప్రదాయబద్ధంగా ఒకేచోట చేరి ఫ్యామిలీ ఫోటో' దిగడానికి సిద్ధమైన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని పలకరించిన జార్జియా మెలోనీ.. మిమ్మల్ని ఇక్కడ మళ్లీ కలుసుకోవడం సంతోషందా ఉందన్నారు. దానికి ప్రధాని మోదీ డిజిటల్ ప్రపంచంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ ఇద్దరికీ ఉన్న పాప్యులారిటీని గుర్తు చేశారు. మోదీ సమాధానానికి ఇటలీ ప్రధాని మెలోనీ హాయిగా నవ్వుతూ.. నిజమే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే ఫేమస్ మన తరువాతే ఎవరైనా అంటూ బదులిచ్చారు.
అలా ఈ ఇద్దరి మధ్యా జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిముషాల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. నిజానికి ప్రధాని మోదీ, జార్జియా మెలోనీల మధ్య ఇలాంటి సరదా ముచ్చట్లు సాగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇటలీ రాజధాని రోమ్ నగరంలో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ ఇటలీ పీఎం మెలోనీకి మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అప్పట్లో మెలోనీ, హలో ఫ్రం ది మెలోడి టీమ్ అనే క్యాప్షన్‌ను జోడించి మోడీ తనకు మెలోడీ చాక్లెట్లను బహుమతిగా అందజేస్తున్న ఫొటోను పోస్టు చేశారు. అప్పటి నుంచి నెటిజన్లు నరేంద్ర మోదీ పేరులోని చివరి అక్షరాలను, జార్జియా మెలోనీ పేరును కలిపి మెలోడి హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/most-fmous-on-instagram-36-223174.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.