ఆహారంలో మునగాకు చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

Publish Date:Dec 2, 2023

Advertisement

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి. సరైన ఆహారం తీసుకుంటే అసలు జబ్బుల గోల ఉండదు, అంతకు మించి మందుల తలనొప్పి అసలే ఉండదు. కానీ ఆహారాల మోజులో పడి కొందరు అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు. మన చుట్టూ ఎంతో సులువుగా లభించే ఆహారాలతోనే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. చాలాచోట్ల మునగ చెట్లు బాగా పెరిగి ఉంటాయి. వీటి కాయలు అయితే డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. కానీ మునగాకు మాత్రం డబ్బు వెచ్చించకుండానే కోసుకోవచ్చు.

 ఒకవేళ మునగ చెట్లు అందుబాటులో ఉంటే మాత్రం తరచుగా మునగాకును మిస్ కాకుండా తినండి.  కేవలం మునగాకే కాదు మునగ పువ్వులను కూడా  ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మునగాకును పప్పు, కారప్పొడి, టీ వంటి వంటకాలుగానూ, మునగ పువ్వులను కూడా ఇదే విధంగానే వండుకుంటారు. చాలా మంది మునగాకును, మునగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని ఉపయోగించుకుంటారు. మార్కెట్లో కూడా మునగాకు పొడి డబ్బులు పోసి కొనాల్సి వస్తోంది. కాబ్టటి మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పోషకాలేంటో.. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

మునగాకులో ప్రోటీన్, విటమిన్-బి6, విటమిన్-సి, విటమిన్-ఎ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు సమృద్దిగా ఉంటాయి.

మునగాకు తరచుగా తీసుకుంటే ఎముకలు బలపడతాయి.  కాల్షియం తక్కువ ఉందని కాల్షియం ఆధారిత ఆహారం తీసుకున్నా ఎముకలు బలంగా మారకపోతే మునగాకును ఆహారంలో చేర్చుకోవచ్చు.

మునగాకు అల్సర్లను తగ్గించంలో అద్బుతం చేస్తుంది. ఇందులో యాంటీ అల్సర్ గుణాలు ఉన్నాయి. అల్సర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మునగాకును తింటూ ఉంటే సమస్య తొందరలోనే తగ్గిపోతుంది.

అధికబరువు సమస్య ఇప్పట్లో పెద్ద తలనొప్పిగా మారింది. కానీ బరువు తగ్గించడంలో మునగాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే పైబర్  జీర్ణాశయ పనితీరు మెరుగుపరుస్తుంది.

మునగాకులో ఉండే పైబర్ అధిక బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

శరీరానికి శక్తి అందించడంలో మునగాకుది అందె వేసిన చెయ్యి. దీన్ని తింటూ ఉంటే శరీరం బలంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

అన్నింటి కంటే ముఖ్యంగా మునాకును మధుమేహం ఉన్నవారిని తినమని సిఫారసు చేస్తారు. కాస్త వైద్యం మీద అవగాహన ఉన్నవారి నుండి నైపుణ్యం ఉన్న వైద్యుల వరకు అందరూ మునగాకును తీసుకోమని సమర్థిస్తారు. మునగాకు ఆహారం ద్వారా విడుదలయ్యే చక్కెరలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగాకు తినాలి. ఐరన్ లోపం దీర్ఘకాలం పాటూ కొనసాగితే అది రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఐరన్ భర్తీ అయితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.

మునగాకు తింటే కలిగే మరో అధ్బుతమైన లాభం.. జుట్టు పెరుగుదల. చాలామంది జుట్టు పెరుగుదల కోసం తలకు హెయిర్ ప్యాక్ లు, షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. కానీ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లోపే జుట్టు పెరుగుదల లోనూ, జుట్టు రంగు లోనూ, జుట్టు మందంగానూ మారుతుంది.

                                                    *నిశ్శబ్ద.

 

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.