Publish Date:Mar 26, 2025
గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఏ1 గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు అరెస్టు చేశారు.
రంగాను మంగళవారం (మార్చి 25) రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఓలుపల్లి మోహన్ రంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేదు. అయితే తరువాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించిన సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అలా చేర్చిన తరువాతే అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగారు.
కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుపాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడి భుజంగా చెప్పుకునే మోహన్ రంగా పోలీసులకు చిక్కడంతో వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగులో ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిలు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన్ రంగా అరెస్టుతో.. వంశీకి బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసులో ఒక వేళ బెయిలు దొరికినా.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు దాదాపు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన్ రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/more-troubes-to-vallabhaneni-vamshi-39-195047.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!