అసలు మోపిదేవి.. జగన్ మధ్య ఏం జరిగింది?

Publish Date:Aug 30, 2024

Advertisement

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం రాజకీయంగా ఒకింత సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచిన మోపిదేవి వెంకట రమణ.. పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉ:టూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు. అటువంటి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలలో రానున్న భారీ మార్పులకు సంకేతంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ, పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీకి ముఖచిత్రంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ కూడా ఆయన జగన్ కు విధేయంగా ఉంటూ వచ్చారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. 

పార్టీకీ రాజీనామా చేసుంతగా మోపిదేవిలో జగన్ పట్ల అసంతృప్తి పేరుకుపోవడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తనకు కానీ, తన సోదరుడికి కానీ జగన్ టికెట్ నిరాకరించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మోపిదేవి పలు మార్లు కోరినప్పటికీ రేపల్లె నుంచి మోపిదేవికి టికెట్ నిరాకరించే విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలాగే ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేడయంతో మోపిదేవికి అవమానకరంగా మారింది. అంతే కాకుండా పార్టీ వ్యవహారాలలో కూడా మోపిదేవికి ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక పార్టీ పరాజయం తరువాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఫలితాల తరువాత నుంచీ మోపిదేవి వైసీపీకి గుడ్ బై చెబుతారన్న టాక్ పోలిటికల్ సర్కిల్స్ లో వినబడుతూనే ఉంది.

 ఇప్పుడు తెలుగుదేశంలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఆయన రాజకీయ విధేయతలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నది అవగతమౌతోంది.  
ఇంతకీ మోపిదేవి చంద్రబాబుతో టచ్ లోకి ఎలా వెళ్లారంటే రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబుతో మోపిదేవి సమావేశమయ్యేందుకు సహకరించారు. ఆ సమావేశంలో మోపిదేవి వెంకటరమణతో పాటు మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇరువురూ కూడా వైసీపీకి, తమతమ రాజ్యసభ సభ్యత్వాలకూ రాజీనామా చేశారు. ఏ క్షణంలోనైనా తెలుగుదేశం కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి.  మొత్తం మీద మోపిదేవి వంటి విధేయుడే  దూరం అవ్వడం పార్టీలో జగన్ నాయకత్వంపై అవిశ్వాసం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తనకు బలం ఉందని భావిస్తున్న రాజ్యసభలోనూ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ కూడా వైసీపీకి రానున్న రోజులలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. 

By
en-us Political News

  
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.