జగన్ అక్రమాస్తుల కేసు: మోపిదేవి బెయిల్ ఫై విడుదల
Publish Date:Dec 23, 2012
Advertisement
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, చంచల్ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు కు సిబిఐ ప్రత్యెక న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఆయన ఈ ఉదయం జైలు నుండి విడుదల అయ్యారు. శబరిమల వెళ్లేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి కోర్టు ను అభ్యర్ధించిన విషయం తెలిసిందే. ఆయనకు జనవరి 2 వ తేదీ వరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విడుదల అయిన తర్వాత మోపిదేవి పంజగుట్ట లోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు. మోపిదేవి దాదాపు నెల రోజుల నుండి అయ్యప్ప దీక్షలో ఉన్నారు. దీనితో ఆయన శబరిమల యాత్ర కు వెళ్ళే అవకాశం లభించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mopidevi-bail-24-19977.html
http://www.teluguone.com/news/content/mopidevi-bail-24-19977.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026





