మహిళలకు నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Publish Date:Mar 14, 2026

Advertisement

 

మహిళలకు నెలసరి సెలవులను చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే ఉద్యోగ నియామకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాంటి విధానం అమలులోకి వస్తే మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో యజమానులు వెనుకంజ వేసే అవకాశముందని ధర్మాసనం పేర్కొంది.

ఉద్యోగినులు, విద్యార్థినులకు నెలసరి సెలవులు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులను చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే యువతులు తాము ఇతర ఉద్యోగులతో సమానం కాదనే భావనకు లోనయ్యే అవకాశం ఉందని, ఇది వారి పురోగతికి ఆటంకంగా మారవచ్చని అభిప్రాయపడింది.

నెలసరి సెలవుల అంశంపై భారతీయ సమాజంలో చాలాకాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ సెలవులు మహిళలకు ఉపశమనంగా ఉంటాయని భావిస్తుండగా, మరికొందరు ఇది లింగ వివక్షను మరింత పెంచే ప్రమాదం ఉందని అంటున్నారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలు, అలాగే అనేక ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగినులకు నెలసరి సెలవులను అమలు చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నెలసరి సెలవు విధానాన్ని అమలు చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెండు నుంచి మూడు రోజుల సెలవులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.

అయితే న్యాయమూర్తులు మాత్రం అలాంటి విధానం మహిళలకు ప్రయోజనం కలిగించదని స్పష్టం చేశారు. ఇది లింగ సంబంధిత మూసధోరణులను మరింత బలపరచడంతో పాటు మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలు మహిళలను నియమించుకోవడంలో వెనుకంజ వేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.

కేరళ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో ఆడపిల్లలకు నెలసరి సమయంలో లీవ్ రిలాక్సేషన్ అందిస్తున్నారు. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా మహిళలకు స్వచ్ఛందంగా నెలసరి సెలవులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది.
 

By
en-us Political News

  
భారత ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేది దేశీయ వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, గత కొన్ని సంవత్సరాల్లో బలపడ్డ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు. 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6శాతం వృద్ధి తరువాత కూడా, భారత్ బలమైన స్థితిలోనే ప్రపంచ అనిశ్చితిలోకి ప్రవేశిస్తోందని అధ్యయనం పేర్కొంది.
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది. ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.