కుక్కపిల్లకు కోతి తల్లి.. తల్లడిల్లుతున్న తల్లి కుక్క

Publish Date:Sep 30, 2025

Advertisement

అప్పుడే పుట్టిన ఓ కుక్కపిల్లకు తానే తల్లి అనుకుంటోంది ఓ వానరం. శునకం పిల్లపై ఆ వానరం కనబరుస్తున్న ప్రేమ అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. అదే సమయంలో తన పిల్ల కోసం ఆ కుక్క పిల్ల తల్లి తల్లడిల్లుతున్న తీరు అయ్యో పాపం అనీ అనిపిస్తోంది. ఇంతకూ విషయమేంటంటే  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో  అప్పుడే పుట్టిన కుక్కపిల్లను తన పిల్ల అనుకొని ఒక వానరం ఎత్తుకెళ్ళింది. ఆ కుక్కపిల్లను హత్తుకుని ముద్దులు పెడుతూ గ్రామం అంతా తిరుగుతోంది.  

కుక్కపిల్ల కోసం తల్లికుక్క తల్లడిల్లిపోతోంది. కోతి చెట్లు, ఇళ్ల కప్పులపై కుక్కపిల్లను హత్తుకుని తిరుగుతుంటే.. తల్లి కుక్క ఆ వానరం వెంటే కింద నేలపై అరుస్తూ పరుగులు పెడుతోంది.   స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా   కుక్క పిల్లను మాత్రం ఆ కోతి వదలడంలేదు. మామూలుగా పిల్లి, కుక్క స్నేహం, మేకపిల్లకు పాలిస్తున్న కుక్క లాంటి వాటిని చూసి ఉంటాం. అయితే ఇలా తన జాతి కాని జంతువు పిల్లను తన పిల్లేనన్న భ్రమలో వానరం ఆ కుక్కపిల్లపై చూపుతున్న అనురాగం, ఆప్యాయతా మాత్రం విస్తుగొలుపుతున్నాయి. అదే సమయంలో పిల్లను దూరం చేసుకున్న ఆ తల్లి కుక్క అల్లాడుతున్న తీరు కంటనీరు తెప్పిస్తోందని అంటున్నారు స్థానికులు. 

By
en-us Political News

  
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. ఐదో సీడ్ చియు పిన్ చైన్ పై అద్భుత పోరాటంతో గెలిచింది. పీవీ సింధు, మాళవిక కూడా తదుపరి రౌండ్ కు దూసుకెళ్లారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అఫ్గానిస్థాన్-Aతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి, 200 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, నిర్లక్ష్యపు షాట్‌తో హాఫ్ సెంచరీని ఎలా చేజార్చుకున్నాడో పూర్తిగా చదవండి.
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది.
సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు.
ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.
భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ, అప్రతిహత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించినందుకు మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
సమావేశం ప్రారంభానికి ముందే పవన్ కల్యాణ్ ప్రధాని మోడీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దేవి దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి బొల్లారంలోని బీహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ లేబర్ కాంట్రాక్టర్ పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనిల్ కుమార్, మీనాదేవి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.