డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
Publish Date:Mar 15, 2026
Advertisement
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో రోజుకో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా డ్రగ్స్ మూలాలపై కీలక సమాచారం బయటపడింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కౌశిక్ రవి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పర్యటనకు వెళ్లిన సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కౌశిక్ రవి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండటంతో ఈ వ్యవహా రం మరింత చర్చనీయాంశం గా మారింది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి రోహిత్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) సిల్వర్ శరత్ కుమార్.... ఈయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు కౌశిక్ రవిని విచారించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా మరో కీలక అంశం బయటపడింది. శరత్ కుమార్ పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ వద్ద కోకైన్‌ను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈగల్ టీం శరత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతని వద్ద నుంచి రెండు కోకైన్ ప్యాకెట్ల ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరికీ కోకైన్‌ను శరత్ కుమార్ పంచినట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. అయితే కొంత మిగిలిన కోకైన్‌ను తన జేబులో ఉంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి ఎవరు? నెట్‌వర్క్ ఎక్కడ నుంచి నడుస్తోంది? అనే కోణాల్లో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉండే అవకాశముంద ని పోలీసులు అనుమానిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/moinabad-drugs-case-36-215527.html





