నరాలు తెగే ఉత్కంఠ, గోళ్లే కాదు.. వేళ్లే కొరికేసుకునేంత టెన్షన్.. ఇదీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు చివరి రోజు పరిస్థితి. చేతిలో నాలుగు వికెట్లు ఉండగా, కేవలం 35 పరుగులు చేస్తే విజయం వరించే స్థితిలో ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేపట్టింది. నాలుగో రోజు ఆట తిలకించిన ఎవరైనా సరే ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అన్న నిర్ణయానికి వచ్చేశారు. కానీ భారత్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన హైదరాబాదీ స్టార్ బౌలర్ ఔను స్టార్ బౌలరే మహమ్మద్ సిరాజ్ టీమ్ ఇండియా విజయమే ఈ టెస్టు ఫలితం అన్న నమ్మకంతో ఉన్నాడు. అదే నమ్మకంతో బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ మాత్రం భారత్ కు అంత సునాయాసంగా చిక్కలేదు. చెమటోడ్పించింది. ఉత్కంఠ రేకెత్తించింది. నిరాశలో ముంచింది. ఆశలు చిగురింప చేసింది. చివరకు విజయం అందింది. అందుకు ముఖ్య కారకుడు నిస్సందేహంగా సిరాజ్ అనడంలో సందేహం లేదు.
అన్నిటికీ మించి ఆదరణ తగ్గిపోతున్నదని అంతా భావిస్తున్న టెస్ట్ క్రికెట్ లోని మజా ఏమిటో ఈ టెస్టు మ్యాచ్ ప్రతి బంతిలోనూ కనిపించేలా చేసింది. టీ20లు టెస్టు క్రికెట్ ముందు బలాదూర్ అని నిరూపించింది. ఆరు పరుగుల ఆధిక్యతతో టీమ్ ఇండియా ఐదో టెస్టును గెలుచుకుని సిరీస్ ను సమంజసం చేసింది ఈ విజయం సిరాజ్ బౌలింగ్ హైలైట్. ఒక సంచలనం. ఈ టెస్ట్ సిరీస్ లోనే సిరాజ్ నిలకడగా వికెట్లు పడగొడుతూ వచ్చాడు. అంతే కాదు మొత్తం 23 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. అంతే కాదు ఇరు జట్లలోనూ కూడా సిరీస్ లోని ఐదు మ్యాచ్ లూ ఆడిన ఏకైక పేసర్ గా కూడా నిలిచాడు. ఫిట్ నెస్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో మబూమ్రా కేవలం మూడు మ్యాచ్ లే ఆడాడు. అలా బూమ్రా లేని రెండు మ్యాచ్ లలో కూడా సిరాజ్ ఇండియన్ బౌలింగ్ బాధ్యతను సమర్థంగా భుజాన మోశాడు.
ఇక మళ్లీ చివరిదైన ఐదో టెస్ట్ వద్దకు వస్తే నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద పట్టి కూడా నియంత్రించుకోలేక బౌండరీ లైన్ టచ్ చేసి గొప్ప అవకాశాన్ని జారవిడిచిన సిరాజ్.. తన ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆ తప్పిదాన్ని అంతా మరిచిపోయేలా చేశాడు ఓటమి అంచు నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
మొత్తంగా ఉత్కంఠ, ఉత్సాహం, కోపం, నిట్టూర్పు ఇలా అన్ని రకాల మానసిక స్థితులను కలిగేలా చేసిన మ్యాచ్ ఇది. టి20, వన్డేలు తీసికట్టేననిపించిన టెస్ట్ మ్యాచ్ ఇది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mohammad-siraj-back-bone-of-indian-bowling-attack-25-203519.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు