మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో మోడీ.. రాజకీయ వర్గాలలో ఆసక్తి

Publish Date:Jun 16, 2022

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల మొదటి వారంలో ఏకంగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరౌతారు. ఆ మరునాడు అంటే జులై 4న ఏపీలో పర్యటించనున్నారు. మంగళగిరిలో ఆయన ఎయిమ్స్ ను ప్రారంభిస్తారు.

ప్రధాని ఏకంగా మూడు రోజులు తెలుగు రాష్ట్రాలలోనే మకాం వేయనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణను  వేదిక చేసుకుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పార్టీ అగ్రనేతలంతా హాజరు కానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి తెలంగాణలో కమల వికాసం దిశగా వారిని కార్యోన్ముఖలను చేయడానికి అవసరమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో కూడా బీజేపీ బలోపేతం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సొంతంగా బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పార్టీనీ, ఏ వ్యక్తినీ పార్టీ భుజాన మోయదంటూ బీజేపీ జనసేనకు స్పష్టత నిచ్చింది.

ఈ నేపథ్యంలోనే మోడీ రాష్ట్రపర్యటనకు ప్రాధాన్యత వచ్చింది. ఏపీ గడ్డపై నుంచి రాష్ట్ర బీజేపీ సేనలకు ఆయన ఏం చెబుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన ఉంది. అయితే పర్యాటకులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికలో బీజేపి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం ఖరారైనప్పటికీ, మరో సారి అదే విషయమై జగన్ తో చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.  మొత్తం మీద దక్షిణాదిలో బలోపేతం కావాలన్న బీజేపీ యత్నాలకు అనుగుణంగానే ప్రధాని, హోంమంత్రి సహా కమలం పార్టీ  నే తలు ఒక్కరొక్కరుగా తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే  మోడీ వరుసగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటన ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణలో రెండు రోజులు మకాం వేయనున్నారు. ఆ సందర్భంగా తెలంగాణలో పార్టీ బూత్ స్థాయిలో బలోపేతం అయ్యేలా క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడంతో పాటు ఏపీకి చెందిన పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. ఏపీలో కూడా ముందస్తు అంచనాల నేపథ్యలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు.. పార్టీకి నష్టం వాటిల్లకుండా, పొత్తుపొడుపుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎవరెన్ని చెబుతున్నా ఏపీలో బీజేపీకి వైసీపీకి మైత్రి బహిరంగ రహస్యమే. ఆ కారణంగానే తన మిత్రుడికి మేలు కలిగేలా రాష్ట్రంలో విపక్షాల ఐక్యతకు గండి కొట్టేలా రాష్ట్రంలో కమలం నాయకత్వం వ్యవహరిస్తున్నది. వైసీపీ బలం పెచ్చు చేసి చూపుకునేందుకు వీలుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీకి నిలిపిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటన సందర్భంగా అధికార పార్టీపై విమర్శల మరకలు కాకుండా ప్రశంసల మెరుపులు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతుకు సంబంధించిన మంతనాలకే మోడీ ఏపీ పర్యటన పరిమితమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయంటేన్నారు.  నిన్న గాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తినలో పర్యటించి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ భేటీ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ.. ఇరువురి మధ్యా చర్చ ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడంపైనే జరిగిందని ఇరు పార్టీల నాయకులూ కూడా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు.

అంతకు మించి ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి డిమాండ్లేవీ జగన్ మోడీ ఎదుట ఉంచలేదని కూడా అంటున్నారు. అయితే రాష్ట్రంలో షో రన్ చేయడానికి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మరింత అప్పు మంజూరు చేయాలని జగన్ ప్రధానిని కోరారనీ, అందుకు మోడీ సానుకూల స్పందన ఫలితమే.. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టుకుని రుణం పొందేందుకు ఆర్బీఐ అంగీకరించడమని చెబుతున్నారు. అదనపు రుణాన్ని అందించినందుకు మోడీకి జగన్ కృతజ్ణతలు తెలపడం వినా మోడీ రాష్ట్ర పర్యటన వల్ల ఒరిగేది, ఒనగూడేదీ ఏమీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.