నీరో చక్రవర్తిలా ప్రధాని మోడీ తీరు

Publish Date:Jun 19, 2022

Advertisement

దేశం తగులబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారని విన్నాం.. కానీ ప్రధాని నరేంద్రమోడీ తీరు చూస్తుంటే సరిగ్గా నీరో చక్రవర్తే గుర్తుకొస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ..నమో అంటూ అభిమానుల చేత ప్రశసంలు అందుకుంటుంటారు. అయితే ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఇటీవలి కాలంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, అమలు చేస్తున్న ప్రతి విధానం ప్రజలలో అసంతృప్తికి, ఆగ్రహానికీ కారణమౌతూనే ఉంది. అయితే ఆయన మాత్రం తన విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకించే వారంతా దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారే అంటు ఎదురుదాడి రాజకీయంతో అణచివేయాలని చూస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయం తీసుకున్నా..ఇప్పుడు అగ్నిపథ్ పథకాన్ని తీసుకున్నా.. ఆయన తీరు ఒకేలా ఉంది. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నా మోడీ మాత్రం నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయింపు లాంటి మాటలే మాట్లాడుతున్నారు. రైతు చట్టాల విషయమే తీసుకుంటే.. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా, ఎటువంటి చర్చకు తావివ్వకుండా.. పార్లమెంటులో ప్రవేశ పెట్టి విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా సభలో మంద బలంతో ఆమోదింప చేసుకున్నారు. ఈ విషయంలో విపక్షాల అభ్యంతరాలు, సూచనలను అసలు పరిగణనలోనికే తీసుకోలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ ఉద్యమం చేశారు. హస్తిన సరిహద్దుల్లో టెంట్లు వేసి ఆందోళనలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆయన మౌనముద్ర వీడలేదు. అనివార్యంగా రైతు ఉద్యమం గురించి మాట్లాడాల్సి వచ్చినా కొన్ని శక్తులు రైతులను పక్కతోవ పట్టిస్తున్నాయన్న మాటనే పదే పదే వల్లె వేశారు తప్ప.. వారి వ్యతిరేకత వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఒక వైపు రైతు ఉద్యమం ఉదృతంగా సాగుతుండగానే ఆయన విదేశీ పర్యటనలతో కాలం గడిపేరు. యథా రాజా.. అన్న చందంగా మోడీ ఇలా మొండిగా వ్యవహరిస్తుంటే.. ఆయన కేబినెట్ లోని మంత్రులు సైతం అదే విధంగా ఇష్టారీతిన రైతుల ఉద్యమంపై విమర్శలు గుప్పించారు. విపక్షాలను నిందించారు. దేశంలో రైతు బాగుపడటం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేదని విమర్శించారు. రైతుల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని అనడానికీ వెనుకాడలేదు. సరే ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ మోడీ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. 
ఇప్పుడు అగ్నిపథ్ విషయంలోనూ అంతే.. ఒక విధాన నిర్ణయం తీసుకునేటప్పడు విపక్షాలతో చర్చించడం కానీ, సభలో ప్రవేశ పెట్టి సమగ్ర చర్చ జరపడం కానీ లేకుండానే.. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్నిపథ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించేశారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభం కాగానే ఆయన గతంలోలానే ఇది దేశ ప్రగతిని ఓర్వలేని శక్తులు నడిపిస్తున్న ఉద్యమం అంటూ ఓ విమర్శ చేసేసి తన స్వరాష్ట్రంలో పర్యటనకు వెళ్లిపోయారు. సరిగ్గా సాగు చట్టాల విషయంలో వ్యవహరించినట్లు మోడీ కేబినెట్ లోని మంత్రులు మాత్రం అగ్నిపథ్ పథకాన్ని అద్భుతం అని అభివర్ణిస్తూ, వ్యతిరేక ఆందోళనల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయనీ, ఆర్మీ బలోపేతం కావడం ఇష్టం లేని శక్తులే వెనుకుండి ఈ ఆందోళనలను రెచ్చగొడుతున్నాయనీ విమర్శలు మొదలెట్టేశారు. ఈ రెండు విషయాలలోనే కాదు.. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మోడీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా వారిపై దేశ వ్యతిరేకులు, ప్రగతి నిరోథకులు అన్న ముద్ర వేయడం మోడీ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా  మారిపోయింది.  సమస్యను పక్కతోవ పట్టించేందుకు దేశ భక్తి అంశాన్ని ఉపయోగించుకునే మోడీ తీరు మారాలి. సమస్యలపై, ప్రజాందోళనలపై అన్ని పక్షాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించాలి.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.