సెమీ లాక్ డౌన్.. మోడీ ప్రతిపాదనల ఉద్దేశం ఇదేనా?

Publish Date:May 12, 2026

Advertisement

ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని ఎదుర్కొని నిలదొక్కుకోవాలంటే సెమీ లాక్ డౌన్ శరణ్యమని ప్రధాని మోడీ చెప్పకనే చెబుతున్నారా?  అంటే ఆయన వరుసగా జారీ చేస్తున్న మార్గదర్శకాలను చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తుంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితులు చమురు సరఫరా చెయిన్ ను దెబ్బతీసే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉండటంతో.. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం, నానాటికీ పెరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తకొత్త వ్యూహాలకు పదును పెట్టి మరీ  తెరపైకి తెస్తున్నారు.

బంగారం కొనవద్దు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వంటి ప్రతిపాదనల తరువాత ప్రధాని మోడీ తాజాగా ఆయన పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక మార్పులను సూచించారు. ప్రభుత్వ,  ప్రైవేట్ విద్యాసంస్థలు సాధ్యమైనంత వరకు  వర్చువల్  లేదా ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాలని  పిలుపునిచ్చారు. అంటే దాదాపుగా సెమీ లాక్ డౌన్ పరిస్థితులను ఆహ్వానిస్తున్నారన్న మాట. సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా ఉంటే.. ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. 

గత కొద్దిరోజులుగా ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తున్నారు.  ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఐటీ ,  ఇతర రంగాల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దాని కొనసాగింపుగానే  తాజాగా పాఠశాలల నిర్వహణకు సంబంధించి కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలన్నారు. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ ,  అమెరికా మధ్య నెలకొన్న విభేదాలు గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రయాణాలను తగ్గించడం ఒక్కటే మార్గమని ప్రధాని చెబుతున్నారు.  అందుకే కోవిడ్ సమయంలో విజయవంతమైన వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ తరగతులను మళ్ళీ ప్రోత్సహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.  
 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.